టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విజేత’ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిరంజీవి కి అన్నయ్య కొడుకు పాత్రలో నటించాడు. కానీ ఈ సినిమాలో కేవలం ఒక రెండు, మూడు చోట్ల మాత్రమే బన్నీ కనిపిస్తాడు.
కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ మూవీ కంటే ముందు అల్లు అర్జున్ కమల్ హాసన్ హీరోగా మరియు లెజండరీ డైరెక్టర్ కె.విశ్వనాథ్ గారు తెరకెక్కించిన ‘స్వాతి ముత్యం’ సినిమా లోనూ కనిపించాడు. సినిమా మొదటిలో కమల్ తన మనవళ్లలో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా చూస్తే అందులో ఒకడిగా, చిన్నపాత్రలో బన్నీ కనిపిస్తాడు. కానీ సినిమా విడుదల ప్రకారం చూస్తే మాత్రం బన్నీ కి స్వాతి ముత్యమే మొదటి సినిమా అవుతుంది.
ఆ తరువాత బన్నీ చాలా గ్యాప్ తరువాత చిరంజీవి నటించిన డాడీ చిత్రంలో కనిపించాడు. ఈ సినిమాలో బన్నీ క్యారెక్టర్ 5 నిమిషాలకు పైగానే ఉంటుంది. హీరో గా ఇంకా సినిమా తెరకు పరిచయం అవ్వకముందే ఇలా చిరంజీవి నటించిన రెండు సినిమా లలో మెరిసి ఆ తరువాత మళ్ళీ శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలోని ఒక పాటలో మెగాస్టార్‌తో కలిసి బన్నీ స్టెప్పులేశాడు.
ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రం లో నటిస్తున్నాడు. ఈ చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఫస్ట్ లుక్ తో సినిమా బృందం స్పష్టం చేసింది. ఈ సినిమా లో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మాస్ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడట. పుష్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాబట్టి బన్నీ హీరోగా మారక ముందు నుంచే చిరంజీవి కమల్ హస్సన్ చిత్రాలలోనూ నటించాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!