22.7 C
Hyderabad
March 24, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

A – ‘ఆదిపురుష్’ : ఓం రౌత్ ప్లాన్ కి హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీనే షేకవుతోంది..!

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో రూపొందబోతున్న సినిమా ‘ఆదిపురుష్’. పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాని టీ సిరీస్ భూషణ్ కుమార్ – క్రిషన్ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి దాదాపు 750 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. రామాయణం నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో ప్రభాస్ ‘రాముడి’గా.. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ‘లంకేష్’గా నటించనున్నారు.

Prabhas roped in for Om Raut directorial Adipurush | Entertainment News,The Indian Express

కాగా ప్రభాస్ బర్త్ డే అయిన ఈ నెల 23 న ఈ సినిమా నుంచి భారీ సర్‌ప్రైజ్ రివీల్ కాబోతుందని సమాచారం. అయితే ఆ సర్‌ప్రైజ్ ఈ సినిమాలో నటించబోయో సీత పాత్ర ని రివీల్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో నటించే సీత కియారా అద్వాని అని కీర్తి సురేష్ అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయమే ప్రభాస్ బర్త్ డే రోజున వెల్లడి కానుందని తెలుస్తుంది.

కాగా ఈలోపు మరో న్యూస్ సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్‘ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ హీరో ‘ఆదిపురుష్’ లో కూడా నటించబోతున్నాడని సమాచారం. అజయ్ దేవగణ్ ఇప్పటికే ఓం రౌత్ దర్శకత్వంలో ‘తానాజీ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

ఆ కారణంగానే ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం మరోసారి సైఫ్ అలీఖాన్ తో పాటు అజయ్ దేవగణ్ ని కూడా తీసుకున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అజయ్ దేవగన్ ‘శివుడి’ పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ సినిమా మీద అంచనాలు ఊహకందవని అంటున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ సినిమాలకి ధీటుగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ‘ఆదిపురుష్‘ ని వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేస్తున్నారు మేకర్స్.


Share

Related posts

‘మీ బట్టలు మీరే ఉతుక్కున్నారా?’

sarath

Samantha : కరెక్ట్ పాయింట్ లో దొరికిందిగా .. సమంతని ఒక రేంజ్ లో ట్రాల్ చేస్తోన్న నాగార్జున, నాగ చైతన్య ఫ్యాన్స్ !

Ram

ఆసుపత్రి నుండి రజనీకాంత్ డిశార్జ్…! బేగంపేట నుండి చార్టెడ్ ఫ్లైట్ లో చెన్నైకు..

somaraju sharma