NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

నిమిష నిమిషానికీ మారుతున్న ఫలితం..! అమెరికా ఎన్నికల్లో గెలుపెవరిది..!?

 

అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను కల్గిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫలితాల ప్రకారం చూస్తే ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టేక్కే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. మొ త్తం 580 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లకు గానీ 270 గెలుచుకున్న వారే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. ఇప్పటి వరకూ జో బైడన్‌ 238 ఓట్లు, ట్రంప్‌ 213 ఓట్లు  సాధించారు.  ఇంకా ఏడు రాష్ట్రాలకు చెందిన ఫలితాలు తేలాల్సి ఉంది. జార్జియా (16 ఓట్లు), నార్త్ కరోలినా (15), విస్కాన్సిన్ (10), మిచిగన్ (16), నెవేడా (6),  పెన్సిల్ వేనియా (20), అలస్కా (3) ఫలితాలు రావాల్సి ఉంది.

జార్జియా విషయానికి వస్తే ఇక్కడ 94 శాతం లెక్కింపు అయ్యే సరికి డోనాల్డ్ ట్రంప్ లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మిగిలిన ఆరు శాతం లెక్కింపు ప్రదేశాల్లో అట్లాంటా సిటీ ఉంది. అక్కడ జో బైడన్‌కే ఓట్లు ఎక్కువగా పడ్డాయని అంటున్నారు. కానీ ఓవరాల్‌గా జార్జియా 16 ఎలక్ట్రోరల్ ఓట్లు ట్రంప్‌కే వచ్చే అవకాశం ఉంది. నార్త్ కరోలినా లో 94 శాతం లెక్కింపు అయ్యేసరికి ట్రంప్ 79 వేల ఆధిక్యంలో ఉన్నారు. కానీ ఇక్కడ లెక్కింపు పూర్తి చార్లెట్, ర్యాలీ గ్రీన్స్ బారో, ఫయట్ వెల్లీ లో బైడన్‌కే ఎక్కువగా ఓట్లు వస్తాయంటున్నారు. ఓవరాల్ గా ఇక్కడ కొంచెం మెజార్టీతో ట్రంప్ గెలిచే అవకాశం ఉంది. అదే మాదిరిగా విస్కాన్సిన్ లో 94 శాతం ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి ట్రంప్‌ లక్షా 20వేల మెజార్టీతో ఉన్నారు. కానీ లెక్కించాల్సిన ఆరు శాతంలో మాడిసన్, కెనోషా, గ్రీన్ బే, మిల్ వాకీలో బైడన్ కే ఎక్కువ వస్తాయట. అయినప్పటికీ ఓవరాల్‌గా ట్రంప్‌కే అవకాశం ఉండవచ్చు. మిచిగన్ విషయానికి వస్తే 80 శాతం లెక్కింపు పూర్తి అయ్యింది. ప్రస్తుతం ట్రంప్ ఇక్కడ 2.2 లక్షల మెజార్టీతో ఉన్నారు. కానీ డెట్రాయిట్, లాన్సింగ్ లాంటి ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. అక్కడ ఎక్కువగా బైడన్‌కే పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ట్రంప్ ఆధిక్యంతో ఉన్నా గెలుస్తారు అని చెప్పలేని పరిస్థితి. నెవేడా లో 67 శాతం లెక్కింపు పూర్తి అయ్యే సమయానికి 23వేల మెజార్టీతో బైడన్ మెజార్టీతో ఉన్నారు. లాస్ వేగస్, రెనో లాంటి ప్రాంతాల్లో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాలేదు. ఎక్కువ శాతం బైడెన్ కు అవకాశం ఉన్నా ట్రంప్ కూడా ఇక్కడ చాన్స్ ఉంది అంటున్నారు. పెన్సిల్‌వేనియా లో 64శాతం లెక్కింపు పూర్తి అయ్యే సరికి ట్రంప్ ఏడు లక్షల మెజార్టీతో ఉన్నారు. కానీ పిట్స్ బర్గ్, ఫిలడెల్పియా లాంటి ప్రాంతాల లెక్కింపు ఇంకా మొదలు కాలేదు. అక్కడ బైడన్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక అలస్కా లో పూర్తి ఫలితాలు రాలేదు. కానీ ట్రంప్ గెలిచే అవకాశం ఉంది.

ఇప్పుడు ఉన్న పలితాలతో పాటు జార్జియా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్..ట్రంప్ ఖాతాలో వేస్తే 257 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మెచిగన్, నెవేడా లు బైడన్ ఖాతాలో వేస్తే 260 ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే పెన్సిల్వేనియాలోని 20 ఎలక్ట్రోరల్ స్థానాలు కీలకం కానున్నాయి. దీనిని గెలిచిన వారికి మేజిక్ మార్క్ అయిన 270 ను దాటే అవకాశం లభిస్తుంది. ఈ ఏడు రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రం అటు ఇటు అయినా ఫలితం మారుతుంది. అయితే ఆలస్యంగా వచ్చిన ఓట్లు కూడా అనుమతిస్తున్నారని ట్రంప్ మండిపడుతున్నారు.  దీనిపై సుప్రీం కోర్టుకు వెళతానని ట్రంప్ ప్రకటించారు. ఒక పక్క ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే ట్రంప్ ఒక అడుగు ముందుకేసి తానే గెలిచినట్లు ప్రకటించుకొన్నారు. ట్రంప్ ప్రకటనపై జో బైడన్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ట్రంప్ న్యాయస్థానికి వెళితే ఎదుర్కొవడానికి తమ న్యాయ బృందాలు సిద్ధంగా ఉన్నాయని బైడన్ అంటున్నారు. తామే గెలుస్తామని బైడన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N