NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

కృష్ణా జిల్లా రాజకీయాలలో ఇప్పుడు ఇదే విషయం పెద్ద సంచలనంగా మారింది. జిల్లా రాజకీయాలలో కాకలు తీరిన రాజకీయ యోధుడిగా రెండు దశాబ్దాల పాటు ఏక చక్రాధిపత్యంగా దూసుకుపోతున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకు ఊహించని షాక్ తగిలింది. ఒకప్పుడు కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా చెప్పిందే వేదం ఆయన చేసిందే శాసనం.. చివరకు పార్టీ అధినేత చంద్రబాబు సైతం జిల్లాలో ఉమా ఏం చెబితే అదే చేసేవారు. 2014లో పార్టీ గెలిచి ఉమా మంత్రి అయ్యాక ఆయనకు అస్సలు ఎదురులేకుండా పోయింది. ఉమా ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది.

The top leader who is blackmailing Chandrababu..
The top leader who is blackmailing Chandrababu

2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో మైలవరంలో ఉమా తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి అయిన వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓడిపోయారు. రెండు దశాబ్దాల రాజకీయంలో ఓటమి లేకుండా దూసుకుపోతున్న దేవినేని ఉమాకు ఇదే తొలి ఓటమి. అందులోనూ తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చేతిలో ఓడిపోవడం ఉమాకు అస్సలు మింగుడు పడని అంశం. 2014లో ఉమా గెలిచిన మైలవరంలో ఆయనకు కేవలం 7 మెజార్టీ మాత్రమే వచ్చింది. కొన్ని గ్రామాలలో అనుకున్న స్థాయిలో మెజార్టీ రాకపోవడంతో సొంత పార్టీ క్యాడర్‌ను ఉమా దూరం పెడుతూ వచ్చారు.

2019 ఎన్నికల నాటికి ఈ దూరం మరింత పెరిగి ఆయన ఓటమికి ప్రధాన కారణం అయ్యింది. ఇక 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఉమా నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో మైలవరం టిడిపి అంతా ఉమా పై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంది. ఇక తాజా ఎన్నికల నేపథ్యంలో తన చిరకాల రాజకీయ ప్రత్యర్థగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలోకి రావడంతో ఉమా పొలిటికల్ ఫ్యూచర్ గందరగోళం లో పడిపోయింది. వసంత కృష్ణ ప్రసాద్ టిడిపిలో చేరి తాను మైలవరం నుంచే పోటీ చేస్తానని దాదాపు సంకేతాలు ఇస్తున్నారు. అటు చంద్రబాబు సైతం కృష్ణ ప్రసాద్ కు మైలవరం సీటు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇప్పుడు దేవినేని ఉమా ముందు ఉన్న ఒకే ఒక ఆప్షన్ పెనమలూరు. అయితే పెనమలూరు సీటుకు గట్టి పోటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో పాటు పొత్తులో భాగంగా విజయవాడ ఎంపీ సీటు బీజేపీ సుజనా చౌదరికి ఇస్తే ప్రస్తుతం విజయవాడ పార్లమెంటు సమన్వయకర్తగా ఉన్న కేశినేని చిన్ని, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాబాయ్ ఘట్టమనేని ఆదిశేషగిరిరావు రేసులో ఉన్నారు. ఇప్పుడు పెనమలూరులో ఉమాకు ఈ ముగ్గురి నుంచి గట్టి పోటీ ఉంది. పెనమలూరు సీటు విషయంలో టిడిపిలో సంకేతాలు ఎప్పుడు ఎలా అయినా మారిపోయే ఛాన్సులు ఉన్నాయి.

ఇంత పోటీ మధ్యలో ఉమాకు పెనమలూరు సీటు అయినా వస్తుందా అంటే సందేహంగానే కనిపిస్తోంది. ఇవన్నీ ముందుగానే అంచనా వేసుకుని ఉమా ఇప్పుడు పార్టీ అధిష్టానం పై బ్లాక్ మెయిల్ రాజకీయాలు ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సీటు ఇస్తే పార్టీలో ఉంటా లేకపోతే తన దారి తను చూసుకుంటా అంటూ సన్నిహితుల వద్ద లీకులు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లీకులు చంద్రబాబు దగ్గరికి వెళ్లి తనకు సీటు ఇస్తారని తనను బతిమిలాడతారని ఉమా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఏది ఏమైనా చంద్రబాబు వెర్షన్ మరోలా ఉంది. ఉమాను ప్రస్తుతానికి బుజ్జగించి కుదిరిన పక్షంలో సీటు ఇవ్వడం లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదో పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఉమాకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఎవరు ఊహించి ఉండరు. కాలచక్రం గిరిన తిరుగుతూ ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అనేందుకు దేవినేని ఉమా పెద్ద ఉదాహరణ.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju