దాదాపుగా 13 సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టి మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుని ఎంతోమంది అభిమానులని సంపాదించుకున్నారు హీరో రామ్ చరణ్ తేజ్. అప్పటి నుంచి ఇప్పటికి కూడా టాలీవుడ్లో టాప్ 5 క్రేజీ హీరోల్లో ఒకరిగా దూసుకుపోతున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహిస్తూ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’ లో ఎన్టీఆర్ తో కలిసి నటిస్తూ తన ఇమేజ్ మరియు రేంజ్ మరింత పెంచుకుంటున్నాడు చెర్రీ. ఈ సినిమా కోసం రాజమౌళి మరియు అతని బృందం చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ వారు అనుకున్న టార్గెట్ ను రీచ్ అవ్వగలుగుతారా లేదా అన్న సందేహాలు టాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే ఇప్పుడు వరకు ఒక గ్యారంటీ హిట్ మూవీగానే ఇండస్ట్రీలో నిలిచింది.
దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించబోయే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు కూడా ఈ రేంజ్‌కు వెళతారా? అనే చర్చ ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ లో ఊపందుకుంది.
గతంలో జంజీర్ రీమేక్‌తో బాలీవుడ్లో అడుగుపెట్టిన రామ్ చరణ్ కి లక్ కలిసిరాలేదు. ప్యాన్ ఇండియా హీరో అనిపించుకోవాలనే కోరిక ఎన్టీఆర్ తో పోలిస్తే రామ్ చరణ్‌కే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలనే కోరిక చరణ్ కి బలంగా ఉంది.
బాహుబలి రేంజులో ఆర్ఆర్ఆర్ మూవీ కూడా సక్సెస్ సాధిస్తే అప్పుడు బాలీవుడ్‌లోనూ తనకు గుర్తింపు వస్తుందని ఆ తరువాత ప్రభాస్ లాగా తాను కూడా ప్యాన్ ఇండియా స్టార్‌గా మారొచ్చని రామ్ చరణ్ భావిస్తున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా నార్త్ ప్రేక్షకుల మన్నన పొందలేకపోతే ఆ తరువాత నార్త్ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడం చెర్రీకి చాలా కష్టమని టాక్ గట్టిగా వినిపిస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!