క్రియోటివ్ డైరెక్టర్ రంగమార్తాండ ఆగిపోయిందా ..అసలు విషయం ఇదే ..!

క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణ వంశీ కి టాలీవుడ్ లో మంచి పేరున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాం చరణ్, రవితేజ, శ్రీకాంత్ లాంటి హీరోలతో పాటు నాని, సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోలతోను సినిమాలు చేశాడు. అయితే గత కొంత కాలంగా కృష్ణ వంశీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోలేపోతున్నాయి. రాం చరణ్ తో తీసిన గోవిందుడు అందరి వాడే తో పాటు నక్షత్రం లాంటి సినిమాలు కూడా ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటే బాగా డిసప్పాయింట్ చేశాయి.

Krishna Vamsi Attempts A Remake After 21 Years! | Tupaki English

దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న కృష్ణ వంశీ రంగ మార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రాహుల్ సిప్లిగంజ్, బ్రహ్మానందం, శివాత్మిక, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 2016 లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన మరాఠి సినిమా నట సామ్రాట్ కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమా మొదలై దాదాపు రెండేళ్లు కావస్తున్నప్పటికి ఇటీవల ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. దాంతో మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. అయినా మేకర్స్ ఈ వార్తలకి స్పంధించింది లేదు. అందుకే ఆమద్య సినిమా ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. కాగా తాజా సమాచారం ప్రకారం సినిమా దాదాపుగా పూర్తి అయ్యిందని దర్శకుడు కృష్ణవంశీ క్లారిటీ ఇవ్వడంతో క్లారిటీ వచ్చింది. అంతేకాదు పరిస్థితులని బట్టి వచ్చే ఏడాది ప్రథమార్థంలో రంగ మార్తాండ విడుదల కాబోతుందని తెలుస్తుంది.

ఇప్పటికే 80 శాతం పూర్తయిన ఈ సినిమా అన్ని సినిమాల మాదిరిగానే కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా త్వరలోనే మళ్ళీ చిత్రీకరణ మొదలవబోతుందట. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతమందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మళ్ళీ ఈ క్రియోటివ్ డైరెక్టర్ హిట్ కొట్టి ఫాం లోకి వస్తారని అభిమానులందరూ భావిస్తున్నారు.