ఈ ఏడాది కరోనా మహమ్మారి దెబ్బతో ఇండస్ట్రీ మొత్తం స్థంభించి పోయింది. ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయాలంటే ధైర్యం చాలటం లేదు. చేయాలన్నా థియోటర్స్ తెరవాలి. తెరిచినా జనాలు రావడం కష్టం. అందుకే కొన్ని చిన్న సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కాని తమ స్టార్స్ నటించిన సినిమాల కోసం మాత్రం అభిమానులు ఆతృతగానే ఉన్నారు. అయితే తమ ఫ్యాన్స్ ని తృపి పరచడానికి దాదాపు అందరూ స్టార్ హీరోలు వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు.
సినిమాల రిలీజ్ లేకపోయినప్పటికి ఆయా సినిమా టైటిల్స్ లేదా ఫస్ట్ లుక్ పోస్టర్స్ .. లేదా టీజర్స్ ని వదులుతూ అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఇటీవల ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలకి సంబంధించిన గుడ్ న్యూస్ ని ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు. అలాగే అల్లు అర్జున్ కూడా తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో ఉంటుందని అఫీషియల్ గా ప్రకటించాడు. అలాగే మరిన్ని సర్ప్రైజ్ లు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగష్టు 9 నుండి మొదలవనుంది. మహేష్ బర్త్ డే సందర్భంగా ‘సర్కారు వారి పాట’ సినిమా నుండి టైటిల్ డైలాగ్ తో కూడిన ట్రాక్ రిలీజ్ కాబోతుందని సమాచారం.
ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే.. ఆ రోజు అన్నయ్య మెగా అభిమానుల కోసం ఆచార్య సినిమా నుంచి టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు చిరంజీవి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ ఆగస్టు 29న అక్కినేని నాగార్జున పుట్టినరోజు. ఆ రోజు నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేస్తారట. ఇక సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వకీల్ సాబ్ టీజర్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తారని సమాచారం. మొత్తానికి సినిమాల రిలీజ్ లేకపోయినా తమ ఫ్యాన్స్ ని బాగానే సర్ప్రైజ్ చేస్తున్నారు స్టార్ హీరోలు.