NewsOrbit
న్యూస్

UP Elections 2022: యుపీలో ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్..కేబినెట్ మంత్రి మౌర్య రాజీనామా..

UP Elections 2022: యూపితో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల సంఘం రీసెంట్‌గా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీ పార్టీ నుండి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మంత్రిపదవికి కూడా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అనందీబెన్ పటేల్ కు పంపించారు.

UP Elections 2022 Swami Prasad Maurya resigns from yogi cabinet
UP Elections 2022 Swami Prasad Maurya resigns from yogi cabinet

 

Read More: Viral Video: పంజాబ్‌లో మోడీ సెక్యూరిటీ బ్రీచ్ విషయంలో వైరల్ అవుతోన్న వీడియో ; ఉగ్ర సంస్థ నాయకుడు వార్నింగ్ !

UP Elections 2022: ఆ వర్గాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది, అందుకే..

“ప్రతికూల పరిస్థితులు, భిన్నమైన సైద్దాంతిక దృక్పదం మధ్య ఉన్నా కేబినెట్ మంత్రిగా నా బాధ్యతలు ఇప్పటి వరకూ నిబద్దతోనే నిర్వహించాను. దళితులు, వెనుకబడిన వర్గాలు యువకులు, నిరుద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. ఈ కారణంగానే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను” అంటూ స్వామి ప్రసాద్ మౌర్య తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బీజేపీని వీడిన స్వామి మౌర్య..అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని సమాజ్ వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే స్వామి ప్రసాద్ సహా ఆయన కార్యకర్తలు, మద్దతుదార్లను ఎస్పీలోకి ఆహ్వానిస్తున్నాను, స్వామి ప్రసాద్ ఈ నెల 22న మా పార్టలోకి చేర్చుకుంటాము” అని ట్వీట్ చేశారు.

ఎస్పీలోకి రెండో సారి

స్వామి ప్రసాద్ మౌర్య గతంలో సమాజ్ వాదీ పార్టీని వీడి మాయావతి నేతృత్వంలోని బీఎస్పీలో చేరారు. ఆ తర్వాత మయావతి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ సమాజ్ వాదిలో చేరారు. అనంతరం ఎస్పీని వీడి బీజేపీలో చేరిపోయారు. అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన మౌర్యకు ఆ వర్గాల్లో మంచి పట్టు ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఈ కారణంగా యోగి మంత్రి వర్గంలో కార్మిక శాఖ అప్పగించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju