Uppena : ఉప్పెన Uppenaసినిమా ఇప్పుడు టాలీవుడ్ లో ఉప్పెనలా దూసుకుపోతోంది. వసూళ్ళ సునామీని సృష్ఠిస్తూ బాక్సాఫీస్ వద్ద భారీగా భారీ సక్సస్ ని అందుకుంది. 20 ఏళ్ళకి పైగా ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టింది. ఒక డెబ్యూ హీరో సినిమా ఇంత సంచలనం సృష్ఠిస్తుందని .. అది కూడా ఇలాంటి సమయంలో ఇంత భారీ సక్సస్ ని ఏ ఒక్కరు ఊహించలేదు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సినిమా అఖండ విజయాన్ని సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. అంతేకాదు ఏకంగా ఈ సినిమా రిజల్ట్ విషయం లో తన జడ్జ్మెంట్ గనక తప్పైతే ఇకపై ఏ సినిమా విషయంలో కూడా తన జడ్జ్మెంట్ ఇవ్వనని మేకర్స్ కి ధీమాగా చెప్పారట.
ఉప్పెన కథ విన్నప్పుడే మెగాస్టార్ చాలా ఎగ్జైట్ అయ్యారట. అద్భుతమైన కథ అని .. అయితే ఈ కథ లో క్లైమాక్స్ గనక ఎమోషనల్ గా ఉంటే అద్భుతమైన సక్సస్ ని సాధిస్తుందని సలహా ఇచ్చారట. దాంతో దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ రంగంలోకి దిగి మెగాస్టార్ సలాహా ప్రకారం క్లైమాక్స్ లో కీలకమైన మార్పులు చేర్పులు చేసి ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టుగా ఎమోషనల్ గా చేశారట. ఈ క్లైమాక్స్ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అయి సినిమా ఈ రేంజ్ సక్సస్ కి కారణం అయిందని నిర్మాతలు వెల్లడించారు.
Uppena : ప్రివ్యూ చూసిన మెగాస్టార్ సినిమాని వేరే వాళ్లకి అమ్మవద్దని గట్టిగా చెప్పారట.
అంతేకాదు ఉప్పెన సినిమా ప్రివ్యూ చూసిన మెగాస్టార్ సినిమాని వేరే వాళ్లకి అమ్మవద్దని గట్టిగా చెప్పారట. నా జడ్జ్మెంట్ మీద నమ్మకం పెట్టుకొని సినిమాని మీరే రిలీజ్ చేయండి అంటూ మైత్రీ మూవీ మేకర్స్ కి నమ్మకంగా చెప్పారట. నిర్మాతలు ఈ సినిమాకి 20 కోట్ల బడ్జెట్ ఖర్చు చేయగా భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పటికే మేకర్స్ కి భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇక సుకుమార్ చెప్పినట్టు లాంగ్ రన్ లో ఉప్పెన సినిమా 100 కోట్లు వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని ఇప్పుడు పలువురు సినీ ప్రముఖులు..విశ్లేషకులు చెబుతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!