విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్స్ కోసం దేశంలోని టాప్ 17 నగరాలలో తిరిగి ప్రచారం చేశాడు. ఈ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామని ఆశపడ్డాడు. సినిమా రిలీజ్ అయ్యాక పబ్లిక్ టాక్ చూసి విజయ్ దేవరకొండ ఆశలు మొత్తం నీరు గారిపోయాయి, పాపం. అతడు పడ్డ కష్టమంతా వృథా అయిపోయింది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ మాట్లాడిన కొన్ని మాటలే ఈ సినిమా పతనానికి ఒక కారణం అని ఒక థియేటర్ యజమాని తీవ్ర విమర్శలు చేశారు.
విజయ్, నువ్వో పెద్ద అనకొండవి!
తాజాగా ముంబైలోని ఓ థియేటర్ యజమాని విజయ్ పై సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ… “మా సినిమాను బాయ్ కాట్ చేసుకోండి అని చెప్పి తెలివి చూపించుకుంటున్నావా? థియేటర్లలోనే కాదు కనీసం ఓటిటిలో కూడా ఎవరూ ఈ సినిమా చూడరు. నీ పొగరుబోతు మాటల వల్ల మేం నష్టపోతున్నాం. అడ్వాన్స్ బుకింగ్స్‌పై కూడా ఆ మాటల ప్రభావం పడింది. మిస్టర్ విజయ్, నువ్వు కొండవి కాదు అనకొండవి, అనకొండలానే మాట్లాడవు. పతనం దగ్గర పడే సమయంలో ఇలాంటి మాటలే వస్తాయి. నీకు టైం దగ్గర పడింది. అందుకే అలా మాట్లాడావు.” అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నీ అహంకారమే మా కొంప ముంచింది
ఆయన ఇంకా మాట్లాడుతూ.. “విజయ్ నువ్వు చాలా అహంకారవి. ‘ఇష్టం ఉంటేనే చూడండి లేకపోతే సినిమా చూడనవసరం లేదు’ అని నువ్వు అహంకారంతో మాట్లాడిన మాటలు సినిమాపై ఎలాంటి ప్రభావం చూపించాయో ఇప్పటికైనా నీకు అర్థం అయిందా? అమీర్ ఖాన్, తాప్సి, అక్షయ్ కుమార్ సినిమాలు ఎలా కొట్టుకుపోతున్నాయో చూడలేదా? మేం లైగర్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాం. కానీ నువ్వు మాట్లాడిన మాటలకి మా థియేటర్ వాళ్లకి చాలా నష్టం జరిగింది.” అనే విజయ్‌ని తిట్టిపోసాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!