ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ అంటే గుర్తొచ్చేది తమన్నా.. ఆమె అందం, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయినా.. తరగని అందంతో సత్తా చాటుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తోంది.. దక్షిణాది చిత్రాల్లో కంటే ఉత్తరాది సినిమాల్లో బిజీగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్ లో మూడు ప్రాజెక్టుల్లో నటించగా.. అవి రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.
తాజాగా తమన్నాకు సంబంధించిన ఓ క్రేజీ వార్త సంచలనంగా మారింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో లస్ట్ స్టోరీస్ పార్ట్ 2లో విజయ్ వర్మకు జోడీగా తమన్నా నటిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే తమన్నా, విజయ్ వర్మ మధ్య టెస్ట్ షూట్ కూడా చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు వీళ్లిద్దరు కలిసి నటించలేదు. అయితే లస్ట్ స్టోరీస్ లో తమన్నా నటిస్తోందని వార్తతో బీ టౌన్ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది..
లస్ట్ స్టోరీస్ 1 అనేది నెట్ఫ్లిక్స్ కోసం ప్రముఖ బాలీవుడ్ దర్శకులు అనురాగ్ కశ్యప్, దీబాకర్ బెనర్జీ, జోయా అక్తర్, కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన షార్ట్ ఫిల్మ్ లతో కూడిన సంకలన చిత్రం. రాధికా ఆప్టే, కియారా అధ్వానీ, విక్కీ కౌశల్, నేహా దూపియా, భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైలెట్ కాని ఫీమేల్ సెక్సువాలిటీ టాపిక్ తో లస్ట్ స్టోరీస్ సాగుతుంది. ముఖ్యంగా కియారా అద్వానీకి అంత క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ లస్ట్ స్టోరీస్ వల్లే వచ్చింది. నలుగురు విభిన్న నేపథ్యాలు ఉన్న మహిళల జీవితాల్లో జరిగే సాధారణ, అసాధారణ అంశాలను చెబుతూ స్టోరీ నడిపించారు.
ఈ సినిమాకు కొనసాగింపుగా లస్ట్ స్టోరీస్ 2 వస్తుందని అప్పుడే ప్రకటించారు. పార్ట్ లోని ఒక ఎపిసోడ్ లో హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ, మిల్కీ బ్యూటీ తమన్నా నటించనున్నారని టాక్. వీరితో పాటు సీతారామంతో హిట్ కొట్టిన మృణాల్ ఠాకూర్, అంగద్ బేడి మరియు నీనా గుప్తాలు కూడా లస్ట్ స్టోరీస్ 2లో నటించనున్నట్లు తెలుస్తోంది. వారు ఇప్పటికే తమ షూటింగ్ పార్ట్ పూర్తి చేశారని సమాచారం. సుజయ్ ఘోష్ డైరెక్ట చేయబోతున్న ఈ ప్రాజెక్టకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!