తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 సెప్టెంబర్ 4వ తారీఖు సాయంత్రం నుండి మొదలుకానున్నట్టు సమాచారం. ఇప్పటివరకు తెలుగులో ఐదు సీజన్ లు దిగ్విజయంగా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక ఆరవ సీజన్ కి సంబంధించి ఇప్పటికే ప్రోమో…లోగో ఆవిష్కరణ చేయగా మరి కొద్ది రోజుల్లో షో మొదలుకానుంది. ఇటువంటి తరుణంలో షోలో ఆడే కంటెస్టెంట్ లు గురుంచి రకరకాల పేరులు వినిపిస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం వాళ్లంతా క్వారన్ టైన్ లో ఉన్నట్లు కూడా టాక్ నడుస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి సీజన్ లో.. యాంకర్ ఉదయభాను, నేహా చౌదరి, జబర్దస్త్ కమెడియన్ చంటి, యాంకర్ వర్షిణి, నందు, శ్రీ హన్, యాంకర్ ప్రత్యూష, యూట్యూబర్ నిఖిల్, వీరితో పాటు కొరియోగ్రాఫర్ పప్పీ మాస్టర్, యువ హీరోయిన్ సంజనా చౌదరి, జబర్దస్త్ అప్పారావు, మరో యూట్యూబర్ రెడ్డి, గీతూ రాయల్ అనే సోషల్ మీడియా స్టార్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సెలబ్రిటీ కపుల్స్ గా హేమచంద్ర.. శ్రావణి భార్గవి ఇద్దరూ ఆరో సీజన్ బిగ్ బాస్ లో ఆడుతున్నట్లు సమాచారం. మొత్తం 19 మంది అయితే మొదట 15 మంది ఎంట్రీ ఇవ్వనున్నట్లు నాలుగు వైల్డ్ కార్డ్ రూపంలో సర్ప్రైజింగ్ కంటెస్టెంట్ లు హౌస్ లో రాబోతున్నట్లు టాక్.
ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా రాణించడంతో వరుసగా నాలుగు తెలుగు బిగ్ బాస్ షో లకి హోస్ట్ గా రాణించినట్లు అయింది. ఈసారి చాలా కట్టుదిట్టమైన జాగ్రత్తలతో షోకి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు వెళ్లకుండా షో నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. ఇక ఇదిలా ఉంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను..బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శివ ఇంటర్వ్యూ చేయనున్నట్లు సమాచారం.