మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ లాంటి క్రేజీ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఆచార్య”. లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా 40 శాతం షూటింగ్, ఒక సాంగ్ పూర్తయింది. ఇప్పటికే చాలా నెలలు ఆలస్యం అయిన ఈ సినిమా లాక్ డౌన్ తర్వాత అన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చినప్పటికి ఆచార్య మాత్రం మొదలవడానికి ఇంకా రెండు నెలలు పడుతుందని అంటున్నారు. వచ్చే జనవరి వరకు ఆచార్య మొదలయ్యే అవకశాలు లేవని అంటున్నారు.
అయితే షూటింగ్ ఇలా డిలే అవడం పెద్ద విషయం కాదు. కాని ఈ గ్యాప్ లో “ఆచార్య” స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేయాలని భావిస్తున్నారట. అది కూడా మెగాస్టార్ సలహా మేరకే. ఖచ్చితంగా ఆచార్య లో మంచి కామెడీ సీన్స్ ఉండాలని అందుకు ప్రముఖ రచయిత ఆకుల శివ ని రప్పించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సీన్స్ అన్నిటిని రాయిస్తున్నట్టు తెలుస్తుంది.
మెగాస్టార్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఆయన నటించిన సినిమాల్లో చూసిందే. ఇంద్ర, శంకర్ దాదా, బావగారు బాగున్నారా .. ఇలా ఏ సినిమా తీసుకున్నా మెగాస్టార్ కామెడీ తో అదరగొడతారు. కాని సైరా సినిమాలో ఆ అవకాశం లేకుండా పోయింది. రీ ఎంట్రీ మూవీ లో ఉన్న కామెడీ కూడా అభిమానులకి సరిపోలేదు. అందుకే ఆ లోటు ని ఆచార్య సినిమాలో భర్తీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. అందుకే ప్రధానంగా స్క్రిప్ట్ కోసం కొంత సమయం తీసుకోనున్నారని అంటున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!