Mehreen Pirzada: కొంతమంది హీరోయిన్స్ సక్సెస్‌లు అందుకుంటుంటారు గానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కి మాత్రం చేరుకోలేరు. వరుసగా అవకాశాలు వస్తున్నా.. బార్డర్స్ మాత్రం దాటలేకపోతున్నారు. అలాంటి వారిలో మెహరీన్ పిర్జాదా. టాలెంటెడ్ డైరెక్టర్ హనురాఘవపూడి దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది మెహరీన్ పిర్జాదా. మొదటి సినిమాతోనే చక్కటి పర్ఫార్మెన్స్తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
లాగే టాలీవుడ్ మేకర్స్ దృష్ఠిని బాగా ఆకట్టుకొని వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది. అంతేకాదు మొదటి సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ హిట్ అవగానే రెండో సినిమాతోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫిలౌరీ అనే సినిమాలో హీరోయిన్గా నటించి హిట్ అందుకుంది. అయితే అమ్మడికి టాలీవుడ్ మీదే ఫోకస్ ఎక్కువ. అందుకే ఇక్కడ గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తోంది. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ బాగానే క్రేజ్ సంపాదించుకుంది. మహానుభావుడు, ‘రాజా ది గ్రేట్’, సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకుంది.
Mehreen Pirzada: సినిమాలు చేస్తుందో లేదో అని అందరూ మాట్లాడుకున్నారు.
అయితే నోటా, జవాన్, పంతం లాంటి సినిమాలు మెహ్రీన్‌కి షాకిచ్చాయి. ఈ సినిమా అట్టర్ ఫ్లాపవడంతో మెహరీన్ కెర్రిర్ కాస్త స్లో అయింది. అలాగే కవచం సినిమా కూడా ఫ్లాపవడం మెహ్రీన్‌కి మరో షాక్ తగిలింది. అయితే లక్కీగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఎఫ్2’లో నటించే అవకాశం అందుకుంది. ఇందులో వెంకీ సరసన తమన్నా, వరుణ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడంతో మెహ్రీన్‌కి బాగా కలిసి వచ్చింది.
దాంతో మంచి ఫాంలోకి వచ్చింది మెహ్రీన్. మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమా చేసి మరో డీసెంట్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాలతో మళ్ళీ క్రేజీ హీరోయిన్గా మారిన మెహ్రీన్ ఇదే క్రమంలో నాగ శౌర్య సరసన అశ్వద్ధామ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడి మెహ్రీన్ కి వచ్చిన క్రేజ్ కాస్త తగ్గిపోవడానికి కారణం అయింది. ఈ సినిమా గనక హిట్ అయి ఉంటే మెహ్రీన్ కెరీర్ ఇంకోలా ఉండేది. అదే సమయంలో పెళ్ళికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తాయి. దాంతో అమ్మడు సినిమాలు చేస్తుందో లేదో అని అందరూ మాట్లాడుకున్నారు.
Mehreen Pirzada: తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో సినిమా అవకాశాలు.
కానీ పెళ్ళి రద్దు చేసుకున్న మెహ్రీన్, పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే మరోసారి ఎఫ్3 బృందంతో కలిసి సినిమా చేస్తోంది. ఎఫ్2 సినిమాకి సీక్వెల్‌గా ఎఫ్3 రూపొందుతోంది. దాదాపు మొత్తం నటీ నటులు చిత్ర యూనిట్ ఎఫ్2 సినిమాకి పనిచేసిన వారే ఎఫ్3కి పనిచేస్తున్నారు. గ్యారెంటీగా మళ్ళీ మెహ్రీన్ ఎఫ్3 సినిమాతో భారీ హిట్ అందుకొని మళ్ళీ ఫాంలోకి వస్తుందని నమ్మకంగా చెప్పుకుంటున్నారు. అలాగే ‘మంచి రోజులు వచ్చాయి’ అనే సినిమాను చేస్తోంది మెహ్రీన్. ఈ రెండు సినిమాలతోనైనా స్టార్ హీరోయిన్గా మంచి రేంజ్‌కి చేరుకుంటుందేమో చూడాలి. ఇక తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో సినిమా అవకాశాలు దక్కించుకుంటుంది కాబట్టి కెరీర్ పరంగా మాత్రం ఇబ్బంది లేనట్టే.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!