Sunil: సునీల్‌తో బంతి సినిమా తీస్తానన్న త్రివిక్రమ్ బంతిలా తిప్పుకుంటున్నాడా…?

Share

Sunil: టాలీవుడ్‌లో మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ – కమెడియన్ కం హీరో కం విలన్ సునీల్ మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్ పంజాగుట్టలో ఇద్దరూ ఒకే రూమ్ లో ఉండి సినిమా ప్రయత్నాలు చేస్తుండేవారు. అలా ముందు త్రివిక్రం కథా, మాటల రచయితగా అవకాశాలు అందుకున్నాడు. ఆయనకి అవకాశాలు రాగానే తను రాసే సినిమాలలో సునీల్ కి మంచి కామెడి పాత్రలు రాసి దర్శక, నిర్మాతలకి సిఫార్స్ చేశాడు త్రివిక్రం. అలా త్రివిక్రం రాసిన దాదాపు అన్నీ సినిమాలలో సునీల్ మంచి కామెడీ పాత్రలు పోషించారు. త్రివిక్రం రాసే పంచ్ డైలాగులకి సునీల్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.

when sunil-trivikram banthi movie will come on sets
when sunil-trivikram banthi movie will come on sets

త్రివిక్రమ్ రాసిన స్వయం వరం, నువ్వే కావాలి, నువ్వే నువ్వే, మన్మధుడు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, అతడు, ఖలేజా, జల్సా, జులాయి, జై చిరంజీవ, తీన్ మార్ ఇలా అన్నీ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో సునీల్ నటించి బాగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఒక దశలో కామెడీతో చంపేసి మెగాస్టార్ చిరంజీవి కూడా తన సినిమాలో సునీల్ ఓ పాత్ర చేయాల్సిందే అని సిఫార్స్ చేసేంత పాపులారిటీ తెచ్చుకున్నాడు సునీల్. కామెడీ హీరోగానే భారీ రెమ్యునరేషన్ కూడా అందుకున్నాడు. చెప్పాలంటే అప్పుడున్న అందరు కమెడియన్స్‌ను సునీల్ బీట్ చేశాడు.

Sunil: హీరోగా అవకాశాలు రాక సునీల్ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది.

ఈ క్రేజ్‌తో సునిల్‌తో హీరోగా సినిమాలు చేసేందుకు పలువురు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపించారు. పూల రంగడు, అందాల రాముడు, మిస్టర్ పెళ్ళి కొడుకు, మర్యాద రామన్న, భీమవరం బుల్లోడు, కృష్ణాష్ఠమి, ఈడు గోల్డ్ ఎహె ,జక్కన్న, ఉంగరాల రాంబాబు లాంటి సినిమాలతో హీరోగా కొన్నాళ్ళు రాణించాడు. అయితే రెండు మూడు సినిమాలు హిట్ అయ్యాక వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో సునీల్ హీరోగా సినిమాలు చేయాలనుకున్న దర్శక నిర్మాతలు వెనక్కి తగ్గారు. అటు కమెడియన్‌గా అవకాశాలు లేక ఇటు హీరోగా అవకాశాలు రాక సునీల్ పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. దాంతో కొంత గ్యాప్ వచ్చింది.

ఈ క్రమంలో మళ్ళీ త్రివిక్రమ్ తన స్నేహుతుడికి అవకాశాలు కలిపిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సునీల్ కి ఓ పాత్ర ఇచ్చారు త్రివిక్రం. కానీ ఈ పాత్ర సునీల్ కి అంతకముందు వచ్చిన క్రేజ్ తీసుకురాలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన అలవైకుంఠపురములో కూడా అంత పేరొచ్చింది లేదు. దాంతో ఇకపై మంచి పాత్రలు రాసి సునీల్‌కి మళ్ళీ సూపర్ క్రేజ్ తెచ్చేందుకు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ మధ్య సునీల్ కామెడీ వేశాల నుంచి విలన్ వేశాలకి టర్న్అయ్యాడు. రవితేజ నటించిన డిస్కో రాజాలో విలన్ గా చేశాడు. కానీ అది అంతగా క్లిక్ అవలేదు.

Sunil: ‘బంతి’ అనే సినిమా ఉండకపోవచ్చునని అర్థమవుతోంది.

ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్ – రష్మిక మందన్న జంటగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా పుష్పలో కూడా సునీల్ విలన్‌గానే నటిస్తున్నాడు. మరి విలన్‌గా ఎంతవరకు క్రేజ్ తెచ్చుకుంటాడో తెలీదు గానీ.. గతంలో త్రివిక్రం అనుకున్న బంతి సినిమా తీసి మళ్ళీ హీరోగా నిలబెడతాడని మాత్రం సునీల్ చాలా నమ్మకాలు పెట్టుకొని త్రివిక్రం చుట్టూ బంతిలా తిరుగుతున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ప్రస్తుతం త్రివిక్రం కి ఉన్న క్రేజ్.. ఆయన చేస్తున్న బడా ప్రాజెక్ట్స్ చూస్తే సునిల్‌తో ఇప్పట్లో బంతి అనే సినిమా ఉండకపోవచ్చునని అర్థమవుతోంది.


Share

Related posts

టిడిపి చేతికి భలే చిక్కిన వైసిపి..! ఇన్నాళ్ళ ఎదురు చూపుల ఫలితమిది

arun kanna

Today Horoscope నవంబర్ 7th శనివారం రాశి ఫలాలు

Sree matha

Yadiyurappa: య‌డియూర‌ప్ప మ‌న‌సున్నోడ‌ప్ప… ప‌ద‌వి దిగుతూ 6 ల‌క్ష‌ల‌మందికి తీపిక‌బురు

sridhar