NewsOrbit
న్యూస్

WTC Final: 18న జరిగే టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో ఆ ఒక్క స్థానం కోసం నలుగురు పోటీ

WTC Final:  న్యూజిలాండ్తో ఈనెల 18వ తేదీన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. దీనికోసం భారత్ ఇప్పటికే ఇంగ్లాండ్ లో తీవ్రంగా నెట్స్ లో శ్రమిస్తోంది. నిన్నే భారత్ క్రికెట్ జట్టు రెండు టీంలు గా విడిపోయి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడారు. ఈలోపల న్యూజిలాండ్… ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ గెలిచి భారత్ తో ఫైనల్ కోసం పూర్తిగా సంసిద్ధం అయింది.

 

Which four Indian pacers will play WTC Final
Which four Indian pacers will play WTC Final

ఇక ఇంగ్లాండ్ పిచ్ లు అంటే పేసర్లకు స్వర్గధామం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాబట్టి భారత పేస్ దళం పూర్తి స్థాయిలో రెడీ గా ఉండాల్సిందే. అయితే తుది జట్టులోకి ఈమధ్య అనూహ్యమైన ఫామ్ తో సత్తా చాటుతున్న మహమ్మద్ సిరాజ్ ఖచ్చితంగా ఉండే అవకాశాలు ఉన్నట్లు పలు రిపోర్టులు వచ్చాయి. ఖచ్చితంగా మహమ్మద్ సిరాజ్ జట్టులో ఉండేలాగా యాజమాన్యం చూస్తోందని చెబుతున్నారు.

అయితే సిరాజ్ జట్టు లోకి వస్తే అతని కోసం ఇషాంత్ శర్మ, షమీ లేదా జడేజా లలో ఎవరో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది. మామూలుగా ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి భారత్ పేస్ దళాన్ని గత పది సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. అయితే సిరాజ్ ఆస్ట్రేలియా టూర్ లో సత్తా చాటడంతో పాటు భారత్ సిరీస్ గెలిచి టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. పైగా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో కూడా బ్యాట్స్మెన్ పై పదునైన బంతులు సంధించాడు.

ఇక దాదాపు సిరాజ్ కోసం ఇశాంత్ శర్మ బెంచ్ కి పరిమితం కాక తప్పదు అని అంటున్నారు. అయితే జడేజా రూపంలో రెండవ స్పిన్నర్ అవసరం లేదు… బ్యాటింగ్ బలోపేతం గానే ఉంది అనుకుంటే అశ్విన్ ఒక్కడిని ఆడించి ఇషాంత్, సిరాజ్ లతో సహా నలుగురు పేసర్ లతో భారత్ బరిలోకి దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి 18వ తేదీన తుది జట్టు ఎంపిక విషయమై ఈ కోణంలో విపరీతమైన నడుస్తోంది.

author avatar
arun kanna

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju