NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

పాత సామాన్లు కొంటాం @ వైసీపీ అండ్ జగన్ ?

ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో ప్రజలు తమ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించేశారు. ఎంతో మంది టీడీపీ ఎమ్మెల్యేలు చాలా ముఖ్యమైన స్థానాల్లో నిలబడి కూడా చివరికి అడ్రస్ లేకుండా ఓడిపోయారు. ఇక ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా చేసిన నియోజకవర్గాల్లో కూడా తమ పదవిని నిలుపుకోవడానికి నానా పాట్లు పడ్డారు. అలా ఓడిపోయిన టిడిపి మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వైసీపీకి క్యూ కడుతున్న విషయం తెలిసిందే.

ఇక ఈ ప్రక్రియ వైసిపి కి లాభమా లేదా నష్టమా అన్న విశ్లేషణ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే వారి నియోజకవర్గాల్లో ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల చేత దారుణంగా ఓడిపోయి ఒక మూలన కూర్చున్న వారిని జగన్ ఎటువంటి మొహమాటం లేకుండా వైసీపీలోకి చేర్చుకుంటున్నారు. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి రాజమండ్రిలో చందన రమేష్ వైజాగ్ లో రమేష్ బాబు ఇలా అందరూ వైసీపీలో చేరుతుంటే ఉన్న వైసిపి నాయకులు భవిత్యం, ఎమ్మెల్యేల ఉనికి, టికెట్ కోసం పార్టీ కోసం సేవ చేస్తున్న నాయకుల పరిస్థితి ఏమిటి అన్నది పెద్ద సందేహంగా మారింది.మరో వైపు తమ పరపతిని ఉపయోగించి టిడిపి మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పుల్లలు పెడుతూ…. కాంట్రాక్టర్లు పనులు దక్కించుకుంటూ వైసీపీ ఎమ్మెల్యేలను తొక్కేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

ఎంత పాత సామాన్లు అయినా కూడా వీరికి ఉన్న బలంతో గిరాకి మాత్రం బాగా అవుతోంది. దీంతో వైసిపి క్షేత్రస్థాయి నేతల్లో నిరసన వ్యక్తమవుతోంది. కష్టపడి పవర్ దక్కించుకున్న తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా టిడిపి మాజీ ఎమ్మెల్యేలకు ఉండడంతో వైసిపి లోని ఒక వర్గం లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చేసిందన్న రిపోర్టులు వచ్చేశాయి.

ఇక విశ్లేషకులు మాట ఏమిటంటే టిడిపి మాజీ ఎమ్మెల్యేలు వైసీపీకి బలం చేకూర్చడం కంటే బలహీనత గా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. పార్టీ నష్టపోతుందే తప్పించి వీరి వల్ల ఏం లాభం లేదన్నది వారి మాట. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి వల్ల వల్ల లక్ష కోట్లు వచ్చినా ఏం లాభం అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వరకు నాయకులపై.. దాని తర్వాత పూర్తిగా పార్టీ నిర్ణయాల మీద, వ్యవహారాల మీద రాబోయే రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది అన్నది వారి వాదన. ఇక ఎంతోమంది మాజీ ఎమ్మెల్యే లను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్న వైసిపి వారు… త్వరలో రానున్న ముప్పుని చూడలేకపోతున్నారా?

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N