NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఒక మర్డర్ – ఒక చంద్రబాబు – ఒక వై ఎస్ జగన్ – ఒక ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబు నాయుడు శనివారం టిడిపి ఎస్సీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల గృహ నిర్బంధాన్ని ఖండించారు. టిడిపి నేతలు ఒత్తిడి చేయడం వల్లే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారని బాబు తెలిపారు. మృతుడి సెల్ఫోన్ లాక్కోవడం…. పరీక్షలు జరపడం…. హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించడం వెనుక పెద్ద కుట్ర ఉందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అసలు ఇలా వ్యవహరించడం చాలా పెద్ద నేరం అని తప్పుబట్టారు.

 

చిత్తూరు జిల్లాలో జరిగిన దళితుడు ప్రతాప్ హత్యకు సంబంధించి ఆ కేసులో కీలకమైన మృతుడికి చెందిన కాల్ లిస్ట్ ను వెంటనే బయటపెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చౌటుప్పల్ లో కూడా మరో యువకుడి ప్రాణాలు తీసి ట్రాక్టర్ బోల్తా పడి మరణించినట్లుగా చిత్రీకరించారని…. వార్తలు కూడా అందుకు తగ్గట్టుగా బయటకు వచ్చేలా అంతా కథలు అల్లారని చంద్రబాబు అన్నారు. చిత్తూరులో ఎస్సీల పై దమనకాండకు వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలే కారణం అని బాబు ఆరోపించడం గమనార్హం. అంతేకాకుండా జగన్ పాలనలో బాగా దళితులపై అరాచకాలు బాగ ఎక్కువైపోయాయి అన్న విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.

ఇకపోతే రాష్ట్రంలో గత మూడు నెలల్లో దళితుడిపై రెండు శిరోముండనం ఘటనలు చోటుచేసుకోవడం మానవత్వానికి మాయని మచ్చ అని నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా సినీ నిర్మాత నూతన్ నాయుడు ఇంట్లో పనిచేస్తున్న అతనిపై ఇటు ఈ అమానుష ఘటన కు పాల్పడడం తెలిసిందే. ఈ ఘటనలకు, హత్యలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వాళ్లకు కొమ్ము కాయడమ్ మానేసి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారికి సైతం చట్టాలు అతీతం కాదని పరిగణించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

author avatar
arun kanna

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N