Mosagallu : కరోనా కారణంగా అన్నీ పరిశ్రమలు భారీ నష్టాలలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమ అయితే కొన్ని వేల కోట్ల నష్టాలను చూడాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో థియేట్రికల్ రిలీజ్ కాని సినిమాలను ప్రేక్షకులకు అందివ్వడానికి ఓటిటి ప్లాట్ ఫామ్స్ బాగా ఫాంలోకి వచ్చాయి. గత ఏడాది నుంచి వీటి హవా బాగా నడుస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, సహా మిగతా భాషల సినిమాలను ప్రముఖ ఓటీటీలలో రిలీజ్ చేసి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు.
కానీ అన్నీ సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. బిగ్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా జనాలకు కథ నచ్చాలి. అప్పుడే హిట్ అయి నిర్మాత లాభాలలోకి వస్తాడు. లేదంటే పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం కూడా రాదు. సెకండ్ లాక్ డౌన్ కి ముందు యంగ్ హీరో మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ నటించిన ‘మోసగాళ్లు’ రిలీజైంది. పాన్ ఇండియన్ రేంజ్ లో హాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా కనీసం 10వ వంతు కూడా పెట్టిన పెట్టుబడిని తీసుకు రాలేకపోయింది.
Mosagallu : గత మూడేళ్ళుగా విష్ణు వరుస ప్లాప్ లతోనే సతమమవుతున్నాడు.
అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ వల్ల రాని లాభాలు ఇక్కడ వస్తాయా అన్నది పక్కన పెడితే కాస్తో కూస్తో వస్తుందన్నది ఆశ. వాస్తవంగా ఎప్పుడో డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అమ్మేశారు. కానీ సినిమా రిలీజయ్యాక టర్మ్ స్ అండ్ కండీషన్స్ మారినట్టు చెబుతున్నారు. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో గత మూడేళ్ళుగా విష్ణు వరుస ప్లాప్ లతోనే సతమమవుతున్నాడు. ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకుంటే చాలా నిరాశ పరచింది. మరి ఓటీటీ రిజల్ట్ ఎలా ఉంటుందో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!