బాలీవుడ్ హీరోతో కంపేర్ చేస్తున్న ఈ యంగ్ హీరో కి ఈసారైనా హిట్ దక్కుతుందా..?

టాలీవుడ్ యువ న‌టుడు నాగశౌర్య కెరీర్ మొద‌ట్లో చాలా డీసెంట్‌గా కనిపించిన ఇప్పుడు డిఫ‌రెంట్ లుక్స్ ట్రై చేస్తు మాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకోవాలని తాపత్రయపడుతున్నాడు. అయితే ఈ ఏడాది అశ్వ‌త్థామ చిత్రంతో ఆడియెన్స్ ను ప‌లుక‌రించిన ఈ యంగ్ హీరో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. కాగా టాలీవుడ్ లో ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ తీరిక లేకుండా ఉన్న హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఇక తన సొంత బేనర్ లో చేసిన ‘ఛలో’ సినిమాతో అతడి కెరీర్ మలుపు తిరగ్గా.. అప్పటి నుండి వరుసపెట్టి సినిమాలు చేస్తున్న ఈ యువ హీరోకు కరోనా వల్ల బ్రేక్ వచ్చింది.

Naga Shourya's Ashwathama to release on January 31st

లేదంటే ఈ 6-7 నెలల్లో మరో రెండు సినిమాలు లాగించేసేవాడేమో. ఇక సినిమా సినిమాకు డిఫరెంట్ పాత్రలో కనిపించే నాగశౌర్య ప్రస్తుతం సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. కాగా ఈ చిత్రం విలువిద్య నేపథ్యంలో రూపొందుతుండగా ఈ సినిమాలో నాగశౌర్య ప్రొఫెషనల్ ఆర్చర్ కనిపించనున్నాడని సమాచారం. ఇక ఈ సినిమాలో నాగశౌర్యకు జోడిగా రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ నటిస్తున్న సంగతి తెలిసిందే. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తునారు.

అయితే ఈ చిత్రానికి మొదట పార్థు, అర్జున వంటి టైటిల్స్ ప‌రిశీలించిన టీం ఫైన‌ల్ గా ” ల‌క్ష్య ” ‌ను ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది‌. ఇక నాగశౌర్య ఇప్పుడు చేస్తున్న సినిమాకి పెట్టిన టైటిల్ గతంలో బాలీవుడ్ లో హృతిక్ రోషన్ చిత్రానికి పెట్టిన టైటిల్ కాగా హిందీలో ఆ సినిమా సూపర్ హిట్ నిలిచింది. దీంతో ఈ సినిమా కూడా అలాగే మంచి హిట్ సాధిస్తుందన్న నమ్మకం తో ఉన్నాడట నాగ శౌర్య. ఇక ఇప్ప‌టికే అనీష్ కృష్ణ డైరెక్ష‌న్ లో వరుడు కావ‌లెను మూవీతోపాటు శ్రీనివాస్ అవ‌స‌రాల ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు నాగశౌర్య. ‌