కొణిదెల శివ శంకర వరప్రసాద్ …సినిమాలలోకి వచ్చాక చిరంజీవి. కాస్త స్టార్ డం వచ్చాక సుప్రీం హీరో చిరంజీవి. కాని ఇంకా ఏదో బలమైన బిరుదుండాలి. అప్పుడే మన స్టార్ హీరో చిరంజీవి స్టామినా ఏంటో అందరికీ తెలుస్తుంది. ఆ బిరుదు ఇంకెవరికీ ఉండకూడదు.. మరెవరూ పెట్టుకోకూడదు ..ఇదీ ప్రముఖ నిర్మాత, క్రియోటివ్ కమర్షియల్ సంస్థ అధినేత కె.ఎస్.రామారావు ఆలోచన. ఈ స్టార్ ప్రొడ్యూసర్ కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన పేరుంది.
ఆయన ఏ సినిమా తీసిన ..ఏ హీరో తో తీసిన భారీగా ఖర్చు చేస్తారు. సినిమా బాగా రావాలనే కె.ఎస్.రామారావు ఆలోచన తప్ప ఎంత పెడితే ఎంతొస్తుంది అన్నది ఎప్పుడు లెక్క పెట్టుకుని సినిమా తీసేవారు కాదు. అందుకే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరోల దగ్గర్నుంచి రీసెంట్ గా స్టార్ గా టాలీవుడ్ లో క్రేజ్ ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించారు. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాని నిర్మించిన కె.ఎస్.రామారావు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ద్వారా చాలా విషయాలను వెల్లడించారు. అలాగే చిరంజీవి కి మెగాస్టార్ అన్న బిరుదు ఎలా ఇచ్చారో కూడా ఈ సందర్భంగా బయట పెట్టారు.
కె.ఎస్.రామారావు చిరంజీవితో 1983లో ‘అభిలాష’ సినిమా నిర్మించారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరసగా చిరంజీవి తో ‘ఛాలెంజ్’ ‘రాక్షసుడు’ ‘మరణ మృదంగం’ ‘స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్’ వంటి సూపర్ హిట్స్ ని నిర్మించారు. అయితే ‘అభిలాష’ సినిమా ముందు వరకు చిరంజీవికి సుప్రీం హీరో అన్న బిరుదు ఉంది. దాంతో మన హీరోకి ఇంకా కొత్త తరహా బిరుదుండాలి అని ఆలోచించి మెగాస్టార్ అని పెట్టారట. ఈ విషయాన్ని నిర్మాత కె.ఎస్.రామారావు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!