KGF 2 : కే జి ఎఫ్ సినిమా తో కన్నడ చిత్ర పరిశ్రమ రేంజ్ మార్చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు కే జి ఎఫ్ పార్ట్ 2 తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరి కొద్ది నెలల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దేశవ్యాప్తంగా సినీ అభిమానులు అందరూ ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో హీరో పోషించిన యశ్ చేసిన పర్ఫార్మెన్స్ కి అతనికి లక్షలాది అభిమానులు ఏర్పడ్డారు. ఇక హీరోగా ఇతర ఇండస్ట్రీలో కూడా యశ్ మార్కెట్ భారీ మార్కెట్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగులో అయితే అతనికి స్టార్ హీరో రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. కే జి ఎఫ్ 2 తర్వాత వెంటనే యశ్ మరో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.
అసలు కె జి ఎఫ్ సినిమాకు ముందు యశ్ అంటే ఎవరో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు కనడ మార్కెట్ మొత్తం అతడికి సొంతం. అతని సత్తా బాలీవుడ్ చేరింది. కే జి ఎఫ్ 2 లో తన పాత్ర పోషించేశాడు. ప్రస్తుతం అతను మరొక సినిమా లైన్ లో పెట్టాడు. ‘మఫ్టీ’ అనే సినిమాతో ఇప్పటికే బెంగళూరు సినీ సర్కిల్స్‌లో మంచి క్రియేట్ చేసిన దర్శకుడు నర్తన్ తో యశ్ తన తరువాత చిత్రం ఉంటుందట.
అది కూడా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఇప్పటికే డైరెక్టర్ నర్తన్ మన యశ్ కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశారని చెబుతున్నారు. కన్నడ వారి నుండి మాస్ ఎంటర్టైనర్స్ కి బాగా అలవాటుపడ్డ తెలుగు వారు యశ్ తర్వాత సినిమా కూడా అదే జోనర్ అని తెలిసి విపరీతంగా సంబరపడిపోతున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!