ఏపిలో వైసీపీ వర్సెస్ టీడీపీ గా సాగుతున్న రాజకీయంలో ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారం కూడా చేరింది. హైదరాబాద్ లో అనుమానాస్పద స్థితిలో కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకోగా ఆమె ఆత్మహత్యకు కారణాలు ఏమిటంటూ తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి ఆపాదిస్తూ వైసీపీ సోషల్ మీడియా ఆరోపణలు, విమర్శలు చేస్తుండగా మానవత్వం అనేది లేకుండా వైసీపీ ప్రవర్తిస్తోందంటూ టీడీపీ ప్రతి విమర్శలు చేస్తొంది. అయితే ఈ అంశంపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా , ఆ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి మీడియా సమావేశంలో సంచలన కామెంట్స్ చేస్తూ ఉమామహేశ్వరి మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు.
“ఉమామహేశ్వరి మరణంపై అనుమాలున్నాయి. మా చంద్రన్న వేధించాడా? లేదా ఇంకెవరైనా చంపి ఉరివేశారా? ఎన్టీఆర్ కూతురు బేలగా ఆత్మహత్య చేసుకుందంటే ఎవరూ నమ్మడం లేదు. సీబీఐI దర్యాప్తు కోరి నిజం నిజం నిగ్గు తేల్చాలి బాబన్నా” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. “అప్పట్లో కోడెలది గుండెపోటు అన్నారు. తర్వాత ఉరి వేసుకున్నారని చెప్పారు. ఆయన మొబైల్ మాయం చేశారు. ఉమామహేశ్వరి గారిదీ సహజ మరణమని నమ్మించాలని చూశారు. చంద్రబాబుకు దగ్గరివాళ్లే ఎందుకిలా అర్ధాంతరంగా చనిపోతున్నారు?” అని విజయసాయి ప్రశ్నించారు. “వైఎస్ గారి మరణంపై అవమానకరంగా మాట్లాడారు. జగన్ గారిపై హత్యాయత్నం చేయించి కోడి కత్తి అంటూ హేళన చేశారు. బరితెగించినోళ్లకి చంపడం, సుపారీ హత్యలు చేయించడం ఒక లెక్కా?” అన్నారు విజయసాయిరెడ్డి. “మరణించాక ఎన్టీఆర్ శవాన్ని లాక్కున్నారు! కోడెల శివప్రసాద్ కంటే ముందుగా ఆయన సెల్ ఫోన్‌కు అంత్యక్రియలు చేశారు! ఇప్పుడు…పప్పుగాడి పిన్ని గారు –చున్నీతో ఉరి వేసుకుందంటున్నారు! ఏం క్రిమినల్స్ ఫ్యామిలీరా బాబూ మీది! ” అంటూ విజయసాయి ఆరోపణలు విమర్శలను సంధించారు.
వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఇదే అంశంపై చంద్రబాబుపై విమర్శలు సంధించారు. ఉమామహేశ్వరి ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. ఆమె బలవన్మరణానికి చంద్రబాబే కారణమని అనుమానం ఉంది కాబట్టి సీబీఐ దర్యాప్తు కోరుతూ చంద్రబాబు లేఖ రాయాలని లక్ష్మీపార్వతి డిమాండ్ చేశారు. చంద్రబాబు లేఖ రాయకపోతే తానే స్వయంగా లేఖ రాస్తానని చెప్పారు. ఉమామహేశ్వరి ఎంతో ధైర్యవంతురాలు, విద్యావంతురాలనీ, ఆత్మహత్య చేసుకునే పిరికితనం ఎన్టీఆర్ కుటుంబంలో లేదని అన్నారు లక్ష్మీపార్వతి. ఆస్తి కోసం, చంద్రబాబు, లోకేష్ ఆమెతో గొడవ పడుతున్నారట అని వ్యాఖ్యానించారు. ఆ ఒత్తిడి భరించలేకే ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్న ప్రచారం జరుగుతోందనీ, ఆమె సూసైడ్ లెటర్ మాయం కావడంతో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయన్నారు లక్ష్మీపార్వతి.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…