NewsOrbit
న్యూస్

రాష్ట్రంలో అందరూ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి’ జగన్ సంచలన ప్రకటన… అందులో ఏముంది?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరూ వైఎస్సార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ పిలుపునివ్వటం ఆసక్తి రేపింది.ముఖ్యమంత్రి ఏమిటి? ఒక యాప్ గురించి చెప్పడమేమిటి అని ఉత్కంఠ రేగింది.అందులో ఏం ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమైంది .

 

వైఎస్సార్ యాప్ అంటే అందులో దివంగత మహానేత గురించి ఉంటుందని చాలామంది అనుకున్నారు.అందుకే ముఖ్యమంత్రి ఆ యాప్ ని రెఫర్ చేశారని భావించారు.అయితే అందరి అంచనాలు తలకిందులయ్యాయి.ఆ యాప్ రైతు సంక్షేమానికి ఉద్దేశించిందని తెలిసి ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.
రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించే సేవలను మరింత సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ‘వైఎస్సార్‌ యాప్‌’ను శుక్రవారం తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా రైతులకు అందే సేవలు, సిబ్బంది పనితీరు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫీడ్‌ బ్యాక్, ఆర్‌బీకేల్లోని పరికరాల నిర్వహణ, క్షేత్ర స్థాయిలో రైతుల అవసరాలు, మెరుగైన సేవలకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను రియల్‌ టైంలో ఉన్నత స్థాయి వరకు తెలుసుకునే అవకాశం వుంటుందని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కె. కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. 

యాప్‌ ద్వారా రైతులకు మెరుగైన సేవలు
► రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల సిబ్బంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా ప్రభుత్వపరంగా వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అమలు చేస్తున్న కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు వివరాలు పూర్తిగా తెలుసుకోవచ్చు.
► రైతు భరోసా కేంద్రాల్లోని పరికరాలు, వాటి వినియోగం, పరికరాల్లో ఏదైనా సమస్యలు ఏర్పడినప్పుడు తక్షణం స్పందించేందుకు వీలుగా సమాచారం ఉంటుంది. కొత్తగా ప్రజల కోసం రూపొందిస్తున్న పథకాలపై వివిధ వర్గాల నుంచి ఫీడ్‌బ్యాక్‌ను కూడా రియల్‌ టైంలో ప్రభుత్వానికి అందించేందుకు అవకాశం ఏర్పడింది. 
► ఈ–క్రాప్‌ కింద నమోదు చేసిన పంటల వివరాలు, పొలం బడి కార్యక్రమాలు, సీసీ (క్రాప్‌ కటింగ్‌) ఎక్స్‌పరిమెంట్స్, క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, విత్తన ఉత్పత్తి క్షేత్రాల సందర్శన, భూసార పరీక్షల కోసం నమూనాల సేకరణ, పంటల బీమా పథకం, సేంద్రీయ ఉత్పత్తుల కోసం రైతులను సిద్ధం చేయడం, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ వంటి అన్ని కార్యక్రమాలను ఆర్‌బీకే సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ యాప్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలను అధికారులు, ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ఏమి చేసినా వినూత్నంగానే ఉంటుందనడానికి ఇదొక నిదర్శనం.








 

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N