NewsOrbit
రాజ‌కీయాలు

ముందే భయపడుతున్న లోకేష్..!

 

ఈఎస్ఐ స్కామ్ కు సంభందించి మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన తరువాత ఆ శాఖకు మంత్రిగా పనిచేసిన పితాని సత్యనారాయణనను కూడా అరెస్ట్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే ఏపి ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ ఫై ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై నేడు వైకాపా ప్రభుత్వం అంతర్లీనంగా విచారణ జరుపుతున్నది. ఇది ఎప్పుడు ఏమి జరుగుతుందో అనేది తెలియదు. 330 కోట్లు అవినీతి జరిగిందని సీఐడీ ఆధ్వర్యంలో గడచిన మూడు నెలలుగా విచారణ జరుగుతోంది.

లోకేష్ లో భయం ఉందా?

నిన్న టెక్కలిలో నారా లోకేష్ పర్యటించారు. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తరువాత అక్కడ మీడియాతో మాట్లాడుతూ..అచ్చెన్నాయడు అరెస్ట్ ను ఖండిస్తూ అనేక విషయాలు మాట్లాడుతూ చివరలో ఫైబర్ గ్రిడ్ కు, ఐటీ మంత్రికి సంబంధం లేదన్నారు. అంటే ఫైబర్ గ్రిడ్ కు సంబంధించి అవినీతి ఆరోపణల మీద ప్రభుత్వం విచారణ చేస్తున్న నేపథ్యంలో నాటి ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లోకేష్ ఐటీ శాఖకు, ఫైబర్ గ్రిడ్ కు సంబంధం లేదని చెప్పుకురావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జగన్ ప్రభుత్వం ఫైబర్ గ్రిడ్ ఫై విచారణ చేస్తుండగా ముందుగానే ఆ విచారణ తనపై కాదన్నట్లు, తనకేమి సంబంధం లేదన్నట్లు అయన మాట్లాడటం ‘గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. ఫైబర్ గ్రిడ్ తో ఐటీ శాఖకు సంబంధం లేదని చెప్పుకోవడం చూస్తుంటే లోకేష్ కు అరెస్ట్ భయం ఉందా? అందుకే ఆ విదంగా చెప్పుకున్నారా అని అంటున్నారు.

ఏపీ ఫైబర్ గ్రిడ్ చాలా సీరియస్ అంశం

ఏపీ ఫైబర్ గ్రిడ్ లో 330కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిలో అప్పట్లో బ్లాక్ లిస్ట్ లో ఉన్న హరిప్రసాద్ అనే వ్యక్తికి సంబంధించిన కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. నిజానికి అయన అనర్హుడు. అంతకు ముందు సంవత్సరమే అయన కంపెనీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళింది. అయినప్పటికీ ఐటీ మంత్రిగా నారా లోకేష్ ఉన్న సమయంలో 330 కోట్ల ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్టు ఆయనకు ఇచ్చారు. అప్పట్లో  ఐఏఎస్ అహమ్మద్ బాబు, మంత్రి లోకేష్ ఫై ఆరోపణలు వచ్చాయి. ఇవి ఎంత వరకు వాస్తవమో తెలియదు కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం కూపీ లాగుతోంది. దీనిలో అవినీతి వెలుగులోకి వచ్చి సాక్షాధారాలు లభిస్తే ఐఏఎస్ అహమ్మద్ బాబు, లోకేష్ లను అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని పుకార్లు మాత్రం వస్తున్నాయి. ఈ పుకార్లు చూసి లోకేష్ భయపడుతున్నారేమో బహుశా.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju