NewsOrbit
న్యూస్

టిడిపి చేతికి భలే చిక్కిన వైసిపి..! ఇన్నాళ్ళ ఎదురు చూపుల ఫలితమిది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో మాయని మచ్చ ఏదైనా ఉందంటే అతని పై ఆరోపించబడిన మరియు అతనిని జైలుకు పంపించి ఇంకా కోర్టులో నడుస్తున్న అవినీతి కేసులే. ఇక అనూహ్య రీతిలో ఊహించని స్థాయిలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జగన్ ను దెబ్బ కొట్టేందుకు ఇంతకన్నా మంచి ఆయుధం టిడిపికి దొరకదు. కానీ జగన్ పాలన మొదలు పెట్టిన సంవత్సరం అవుతున్నా ఈ అవినీతి అంశంపై టార్గెట్ చేసేందుకు టిడిపికి పెద్దగా ఛాన్సులు రాలేదు అనే చెప్పాలి. దాంతో నిట్టూర్పు సెగలతో నీరసించిపోయి ఉన్న వారికి ఊపు తెస్తూ ఈ చెన్నై ఉదంతం చోటుచేసుకుంది.

 

Minister Nara Lokesh comments on TDP leaders who joined YSRCP

ఇటీవల ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఒక కారులో తమిళనాడు పోలీసులకు చిక్కింది. ఆ కారు పై ఒంగోలు ఎమ్మెల్యే మరియు వైసీపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి బొమ్మ ఉంది. అయితే నాకు ఆ కార్ కి ఏమీ సంబంధం లేదని బాలినేని వాదిస్తున్నా టిడిపి వారు మాత్రం వైసిపి వారు ఆ డబ్బు హవాలా లో చెన్నై నుండి మారిషస్ కు పంపే ప్రణాళికలో భాగంగా దొరికిపోయారు అని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ దెబ్బతో ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వైసిపి ఎలా డబ్బు దోచుకుని విదేశాలకు తరలిస్తోందో బట్టబయలు అయిపోయింది అంటూ విపరీతంగా ఏకిపారేశారు.

ఇక ఆ పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ విషయానికి వస్తే… ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి అతను చెన్నైలో జగన్ అతి ఖరీదైన ‘భవనం’ నిర్మిస్తున్నారని ఈ క్రమం లోనే కొన్ని సామాన్లను ఎక్కడికి తరలించారని ఆ సామాన్లు వెనుక ఇంకెన్ని ‘చీకటి వ్యవహారాలు’ ఉన్నాయో అని అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ల పైన ట్వీట్లు వేస్తున్నారు.

 అంతేకాకుండా ఫారెక్స్ ఇంపెక్స్, క్వన్నా ఎగ్జిం, వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లకు వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ భారతీ రెడ్డి, వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి డైరెక్టర్లు గా వ్యవహరిస్తున్నారని మరియు ఈ హవాలా కేంద్రంగా ఉన్న వర్క్ ఈజీ స్పేస్ సొల్యూషన్ సంస్థ రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన ఈ మెయిల్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మెయిల్ అని ఆయన బయట పెట్టారు.

 

ఇవన్నీ వైసిపి సూట్కేస్ కంపెనీలు అని.. వీటి ద్వారా మరియు డబ్బుని అక్రమంగా పంపిస్తున్నారని లోకేష్ చెప్పడం గమనార్హం. ఇదే విషయాలపై రోజుకొక ట్వీట్ వేసి వైసీపీ ని చావు దెబ్బ తీస్తున్న లోకేష్ ఇంకా ఏమేమి బయటపెడతారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా టిడిపి నేతలు మరియు కేడర్ అంతా ఈ పరిణామాలతో పండగ చేసుకుంటున్నారు అనే చెప్పాలి.

author avatar
arun kanna

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N