25.2 C
Hyderabad
January 31, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ జయహో బీసీ మహాసభ గ్రాండ్ సక్సెస్ .. నేతలు ఎవరు ఏమన్నారంటే..?

Share

వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన జయహో బీసీ మహా సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుండి వేలాది సంఖ్యలో మహాసభకు తరలివచ్చారు. ఈ మహాసభకు దాదాపు 85 మందికి ఆహ్వానాలు పంపారు. బీసీ వార్డు మెంబర్ మొదలు కొని పార్లమెంట్ సభ్యుల వరకూ, వివిధ కార్పోరేషన్లు, ఇతర నామినేటెడ్ పదవులు అనుభవిస్తున్న వారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రులు మహాసభకు హజరైయ్యారు.

AP CM YS Jagan

 

ఈ సందర్బంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు బీసీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం చేసిన కృషిని వివరించారు. మంత్రివర్గం మొదలు కొని రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్, మండల పరిషత్, మేయర్ ఇతర నామినేటెడ్ పదవుల్లో బీసీ సామాజికవర్గ నేతలకు అత్యధికంగా అవకాశం కల్పించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో 60 శాతంకు పైగా బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత వైసీపీదేనని తెలిపారు. చంద్రబాబు హయాంలో బీసీలకు అన్ని రకాలుగా జరిగిన అన్యాయాన్ని వివరించారు.

Jayaho BC Mahasabha

 

నాగరికతకు పట్టుకొమ్మలు బీసీలు అని అన్నారు సీఎం జగన్. బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదనీ, బ్యాక్ బోన్ క్లాసులని, వెనుకబాటు కులాలు కాదనీ.. వెన్నెముక కులాలు అని చాటిచెప్పే అడుగులు ఈ మూడేళ్లలో మన ప్రభుత్వం వేసిందని చెప్పారు. బీసీ కులాలు అన్నింటికీ మేలు చేస్తామని పాదయాత్ర లో చెప్పాననీ, ఆ విధంగా రాజ్యాధికారంలో బీసీలను భాగస్వామ్యం చేశానని చెప్పారు. దేశంలోనే తొలి సారిగా శాశ్వత బీసీ కమిషన్ తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ప్రజలకు వివరించాలన్నారు. టీడీపీ, దుష్ట చతుష్టయం, ఎల్లో మీడియా అంటూ మరో మారు విమర్శలు చేసిన సీఎం జగన్ .. రాబోయే ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు అని ప్రజలకు చెప్పాలన్నారు. 2024 ఎన్నికల్లోనూ మన ప్రభుత్వమే ఇంతకంటే ఎక్కువగా విజయం సాధిస్తుందని అన్నారు.

పలువురు మంత్రులు తమ ప్రసంగాల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన బీసీలకు జరిగిన మేలును, పదవుల పంపిణీ తీరును వివరించడంతో పాటు చంద్రబాబు బీసీల పట్ల వ్యవహరించిన తీరును విమర్శించారు. బీసీల అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తున్న జగన్మోహనరెడ్డిని కీర్తించారు. మంత్రి చెల్లుబోయిన గోపాలకృష్ణమూర్తి అయితే ఏకంగా జగన్మోహనరెడ్డిని విష్ణుమూర్తి అవతారంగా సంభోధించారు.


Share

Related posts

YS Jagan: జ‌గ‌న్ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం…క‌రోనా స‌మ‌యంలో డేరింగ్‌ నిర్ణ‌యం

sridhar

Anupama Parameswaran Looking Gorgeous

Gallery Desk

LPG Price Hike: గ్యాస్ వినియోగదారులకు మరో సారి షాక్ ..కానీ కాస్త ఊరట..! ఎందుకంటే..?

somaraju sharma