NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఆప్ … దేశ రాజధాని ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం

దేశ రాజధాని హస్తినలో బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చారు ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఈ నెల 4వ తేదీ ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలు జరగ్గా, ఈ రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఎగ్జిట్ అంచనాలకు అనుగుణంగా ఫలితాలు వచ్చాయి. మొత్తం 250 వార్డులు ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ లో మేజిక్ ఫిగర్ అయిన 126 కంటే ఎక్కువ స్థానాల్లో ఆప్ విజయం సాధించి 15 ఏళ్ల బీజేపీ పాలనకు చెక్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యింది. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ ఉదయం 8 గంటల నుండి 42 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు జరిగింది.

Delhi Municipal elections

ఈ ఎన్నికల్లో అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 133 స్థానాలు కైవశం చేసుకోగా, బీజేపీ 105 వార్డులు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలకే పరిమితం అయ్యింది. 2017లో జరిగిన ఎన్నికల్లో నాటి 272 వార్డులకు గానూ బీజేపీ 181 గెలుచుకుంది. ఆప్ 48 వార్డులు మాత్రమే గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది. కేవలం 30 వార్డులను మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ 30 మూడవ స్థానంతో సరిపెట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆప్ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేషధారణలో చిన్నారులు సందడి చేశారు.

Delhi Municipal corporation

ఆప్ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించిన తర్వాత పోటాపోటీగా ఫలితాలు వస్తుండటంతో ఆప్ నేతలు సందిగ్దంలో పడ్డారు. డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా, మంత్రి రాఘవ్ చద్దాలు ఆప్ బాస్ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. కొద్ది సేపటికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అక్కడకు చేరుకున్నారు. చివరకు మ్యాజిక్ ఫిగర్ దాటి ఆప్ వార్డులను కైవశం చేసుకోవడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలను చేసుకుంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఆ జిల్లాలో టీడీపీకి ఒక్క సీటైనా వ‌స్తుందా.. ఇన్ని క‌ష్టాల్రా బాబు…!

జ‌గ‌న్ ఆ ఒక్క ప‌ని చేస్తే మ‌ళ్లీ సీఎం కుర్చీ ఎక్కి కూర్చోవ‌డ‌మే…!

రేవంత్ కేబినెట్లో ముస‌లం మొద‌లైంది.. ఆ ఇద్ద‌రు మంత్రుల‌కు ఎక్క‌డ చెడింది…?

Anchor Syamala: కెమెరామెన్ నుంచి యాంక‌ర్ శ్యామ‌ల‌కు వేధింపులు.. రాత్రుళ్లు ఫోన్ చేసి అంత‌లా టార్చ‌ర్ పెట్టాడా..?

kavya N

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju