NewsOrbit
రాజ‌కీయాలు

బాబూ.. లోకేశూ..! మీరు చూస్తున్నారా..? మునుగుతుందక్కడ..!!

Nara Lokesh: What is Internal Role in TDP Elections?

‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అనే నానుడిలా తయారైంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అక్కడ టీడీపీ నామరూపాల్లేకుండా పోయింది. కేసీఆర్ దెబ్బకు టీడీపీ నాయకులు తమ దారి తాము చూసుకుంటూ టీఆర్ఎస్ లో చేరిపోయారు. చంద్రబాబు ఆ సమయంలో ఏపీలో సీఎం కాబట్టి తెలంగాణలో పార్టీని పట్టించుకునే సమయమే లేకపోయింది. ఆ తర్వాత అసలు తెలంగాణలో టీడీపీ ఉందా..? అనే స్థాయికి వచ్చేసింది. జెండాను నమ్మిన క్యాడర్.. నాయకులు ఒకరిద్దరు తప్ప ఎవరూ మిగల్లేదు తెలంగాణలో. ఇప్పుడు హైదరాబాద్ లో ‘టీడీపీ భవన్’.. ఓ బిల్డింగ్ మాత్రమే అన్నట్టు తయారైంది పరిస్థితి.

babu and lokesh less focus on tdp in telangana
babu and lokesh less focus on tdp in telangana

కోలుకోలేని దెబ్బ తీసిన ఆ సంఘటన..

ఓటుకు నోటు కేసు చంద్రబాబును పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నా ఉన్నపళంగా ప్రభుత్వ కార్యాలయాలతో సహా అమరావతి వచ్చేశారు. దీంతో తెలంగాణలో పార్టీని కనీసం పట్టించుకోలేదు కదా.. వదిలేశారు. 2019లో ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీ అప్పటినుంచైనా తెలంగాణలో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిందా అంటే అదీ లేదు. ఏపీ రాజకీయాల్లో తప్ప తెలంగాణ వైపు దృష్టి మరల్చింది లేదు. లాక్ డౌన్ నుంచి హైదరాబాద్ లోనే చంద్రబాబు ఉంటున్నా.. కనీసం తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయలేదు. దీనిపై అక్కడి నాయకుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణను మార్చమన్నా అధినేత నుంచి ఉలుకూ పలుకూ లేదు.

ఎన్నికల్లో పోటీ లేదు.. విసిగెత్తిపోతున్న కార్యకర్తలు..

తెలంగాణలో ఏరకంగా పోటీ చేసినా ఇక గెలవమనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చేసారని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 1 సీటు మొదలు పార్టీ ప్రాభవం కోల్పోతూనే ఉంది. 2018లో ఆగర్భ శత్రువు కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలపడం టీడీపీ దీన దుస్థితికి పరాకాష్ట. ప్రస్తుత దుబ్బాక ఉప ఎన్నికలపై కూడా పార్టీ దృష్టి సారించలేదు. అధ్యక్షుడు రమణ ఏ నిర్ణయం తీసుకోలేదు.. అభ్యర్ధిని ప్రకటించ లేదు. కార్యవర్గ సమావేశం కోసం కోర్ కమిటీ చంద్రబాబును కలవాలని ప్రయత్నం చేసినా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీంతో తెలంగాణపై వేచి చూసే ధోరణిలో ఉన్నారా.. లేక వదిలేశారా అనే అయోమయంలో ఉన్న ఆ కాస్త క్యాడర్ చర్చించుకుంటున్నారు.

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?