NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు రాజకీయానికి మరో బలిపశువు ! ఎవరాయనంటే?

టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశవాద రాజకీయం ఇప్పుడిప్పుడే కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కి అర్థమవుతోంది.

Babu is another victim of politics! Whoever
Babu is another victim of politics! Whoever

తనను చంద్రబాబు పక్కన పెడుతున్నారని అశోక్ గజపతిరాజు ఇప్పటికీ గుర్తించారట.వెనక్కు వెళితే … ఎన్టీఆర్ను గద్దె దింపి చంద్రబాబును సీఎం చేయడంలో కీలక పాత్ర పోషించిన అశోక్ గజపతిరాజు కే ఇప్పుడు నారా వారు హ్యాండిచ్చారని సమాచారం.టిడిపిలో ఒకప్పుడు చంద్రబాబు తరువాత అంటే యనమల రామకృష్ణుడు, అశోకగజపతిరాజు పేర్లు మాత్రమే వినిపించేవి.చంద్రబాబుకు ప్రియ నేస్తంగా టీడీపీలో అశోక్ గజపతిరాజు ఉండేవారు.2019 ముందు వరకు ఎప్పుడూ ఓటమే ఎరుగని అశోకగజపతి రాజు విజయనగరం జిల్లాలో టిడిపికి పెట్టని కోటగా ఉండేవారు.చంద్రబాబే పట్టుబట్టి ఆయనను 2014 లోక్సభ ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయించారు.

గెలుపొందిన అశోక్ రాజు నరేంద్ర మోడీ కేబినెట్లో మంత్రి కూడా అయ్యారు.అయితే బిజెపితో టిడిపి తెగతెంపులు చేసుకునే సరికి మాజీగా మారిన అశోక్గజపతిరాజు ప్రాభవం అప్పటి నుంచి తగ్గడం మొదలైంది. ఆయన ఢిల్లీలో ఉండగా చంద్రబాబు రాష్ట్ర రాజకీయాల్లో అశోకగజపతిరాజుకు ఏ మాత్రం పడని బొబ్బిలి రాజు సుజయ రంగారావును పార్టీలోకి జేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చి ఆయనను పెంచేశారు.2019 ఎన్నికలలో తండ్రీ కూతుళ్ళు అయిన అశోక్ గజపతిరాజు, అతిధి గజపతి రాజు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లతో ఓడిపోయారు. దాంతో బాబు వారిని పూర్తిగా సైడ్ చేశారని అంటున్నారు.ఈ విషయం ఎప్పుడు స్పష్టమయింద౦టే …తాజాగా చంద్రబాబు పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులను ప్రకటించినప్పుడు అశోక్గజపతిరాజు తన కుమార్తెకు ఆ పదవి ఇవ్వాల్సిందిగా నోరు తెరిచి అడిగినా నారా వారు నో అన్నారట.అశోకగజపతిరాజు అభ్యర్ధనను బాబు ఏ మాత్రం పట్టించుకోకుండా కళా వెంకటరావు తమ్ముడు కొడుక్కు పదవి ఇచ్చారు.

దాంతో రాజా వారు రగిలిపోతున్నారని టాక్. నిన్నమొన్నటి వరకు ఒంటిచేత్తో విజయనగరం జిల్లాలో పార్టీని అశోక్ నడిపించేవారని, అయితే అక్కడ ఇంచార్జి మంత్రిగా గంటా శ్రీనివాస్ లాంటి వారిని దింపి, బొబ్బిలి రాజులను పార్టీలోకి తెచ్చి పార్టీలో వర్గాలు పెంచింది చంద్రబాబేనని అశోక్ వర్గం అంటోంది. ఇక మాన్సాస్ ట్రస్టు వివాదం విషయంలో కూడా చంద్రబాబు పెద్దగా అశోకగజపతిరాజుకు మద్దతిచ్చింది లేదట.ట్రస్టు చైర్మన్ సంచయితకి వైసీపీ ప్రభుత్వం పూర్తి అండగా నిలబడగా అశోక్గజపతిరాజును చంద్రబాబు గాలికి వదిలేశారని ,బాబుకు ఇపుడు అశోక్ అవుట్ డేటెడ్ పొలిటీషియన్ లాగా కనిపిస్తున్నాడని వారు ధ్వజమెత్తుతున్నారు.ఈ పరిణామాలను గమనిస్తున్న అశోక్ గజపతిరాజు కూడా భవిష్యత్లో ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు చెబుతున్నారు

author avatar
Yandamuri

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N