NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఆ ఇద్దరు ఆత్మీయ మంత్రుల విషయంలో నలిగిపోతున్న సీఎం జగన్! ఎవరు? ఏమిటా కథ??

రాజకీయాల్లో మంత్రి పదవులు రావటం… ఊడిపోవటం ఒక మాయే. ముఖ్యమంత్రులకు ఎంతో ఆత్మీయులయినప్పటికీ అనేక సమీకరణాల నేపథ్యంలో ఒక్కోసారి పదవి కూడా పోవచ్చు.

CM Jagan torn in the case of those two spiritual ministers
CM Jagan torn in the case of those two spiritual ministers

ప్రస్తుతం ఇదే పరిస్థితిని నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి,నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కాకాని గోవర్ధనరెడ్డి తదితర హేమాహేమీలు వైసిపి నుండి గెలిచినప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఆ జిల్లా నుండి మేకపాటి గౌతమ్ కుమార్ రెడ్డికి ,అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పదవులిచ్చారు.ఆనం రామనారాయణరెడ్డి , ప్రసన్న కుమార్ రెడ్డిలు గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వారు.కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేయడమే కాకుండా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నేత.అయినప్పటికీ వారినందర్నీ జగన్ పక్కన బెట్టారు.

తనకు అత్యంత ఆత్మీయుడైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డిని క్యాబినెట్లోకి లోకి తీసుకున్నారు.అలాగే బిసి కోటాలో అదే జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ ను అందలమెక్కించారు.వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ రెండువేల పధ్నాలుగు నుంచి పందొమ్మిది వరకు వైసిపి ప్రతిపక్షంలో ఉండగా చాలా చురుకైన పాత్ర పోషించారు.తెలుగుదేశం పార్టీపై ఒంటికాలితో వెళ్లారు.ఇవన్నీ జగన్ కి నచ్చి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారుఅయితే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పరిస్థితులు మారిపోయాయి.మంత్రి పదవి కోసం ఆనం రామనారాయణరెడ్డి నానా యాగీ చేస్తున్నాడు.

CM Jagan torn in the case of those two spiritual ministers
CM Jagan torn in the case of those two spiritual ministers

బహిరంగంగానే తన అసమ్మతిని అసంతృప్తిని ఆయన వెళ్లగక్కిన దాఖలాలు ఉన్నాయి.పైగా త్వరలోనే తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక జరగనుండగా దాన్ని పరిధిలోకొచ్చే వెంకటగిరి ఎమ్మెల్యే రామనారాయణ రెడ్డి ని జగన్ ప్రసన్నం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ విషయంలో భయంకరమైన వ్యతిరేకత నెల్లూరు నెల్లూరు జిల్లా రెడ్డి నేతల నుండి వస్తోంది.దీనికి తోడు యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కొలను పార్థసారథి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఆయన పూర్తి కాలం మంత్రిగా పనిచేశారు.వైసీపీలో కూడా చురుకైన పాత్ర పోషించారు.అయినా జగన్ అప్పుడు అనిల్ కుమార్ కి పదవిచ్చినప్పటికీ ఇప్పుడు సారథి వైపు మొగ్గు చూపక తప్పదంటున్నారు.ఈ పరిస్థితుల్లో ఇంకో ఏడాదిలో జగన్ చేసే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఈ ఇద్దరు మంత్రులపై వేటు తప్పదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju