NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu : అయ్యో కర్రా!!! నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా బాబు??

Chandrababu : అయ్యో కర్రా!!! నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా బాబు??

Chandrababu : తెలుగుదేశం పార్టీ నానాటికి దిగజారి పోవడానికి ఆ పార్టీ అధినేత పోకడలే కారణం అని టిడిపిలో ఓ వర్గం నేతలు చెబుతూ ఉంటారు. ఆయన స్వలాభం కోసం మాత్రమే ఆలోచించే చంద్రబాబు  Chandrababu  నాయుడు నేతల కనీస విషయాలు పట్టించుకోరు అన్నది ఎప్పటి నుంచో ఉన్న మాట.

ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్యుడిగా ప్రస్థానం ప్రారంభించి రెండుసార్లు చంద్రబాబు ఆదేశంతో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన ఓ కీలక నేత మృతి చెందిన టిడిపి నుంచి కనీసం ఎవరు పట్టించుకోకపోవడం ఆ పార్టీ తీరు కు అద్దం పడుతోంది.

is it respect for leader chandrababu
is it respect for leader chandrababu

 కీలక సమయంలో ..

తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న డాక్టర్ కర్రా రాజారావు వైద్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2009లో చింతలపూడి నియోజకవర్గం నుంచి కోటగిరి విద్యాధరరావు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

జిల్లా రాజకీయాలను శాసించే గల నేత గా పేరున్న కోటగిరి ఒక్కసారిగా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం లోకి వెళ్లడం తో పాటు నియోజకవర్గాల పునర్విభజనలో చింతలపూడి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో టిడిపి కు దానిని భర్తీ చేసుకోవడానికి చాలా సమయం పట్టింది.

కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మంచి డాక్టర్ గా పేరున్న కర్ర రాజారావును అప్పటికప్పుడు ఒప్పించి 2009లో టిడిపి టికెట్ ఇచ్చి చంద్రబాబు పోటీలో నిలిపారు. అప్పట్లో ఆయన ఘంటా మురళీ చేతిలో ఓడిపోయారు. నియోజకవర్గం మీద పట్టు లేకపోవడంతో పాటు రాజకీయాలకు కొత్త కావడంతో ఎన్నికల ఇంజినీరింగ్ లో వెనుకబడటం, జిల్లా నేతల సహకారం అంతంతమాత్రంగా ఉండటంతో ఓటమి తప్పలేదు.

** చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా అందరికీ సుపరిచితుడైన రాజారావు ను స్వచ్ఛంద పదవీ విరమణ చేపించి మరి రాజకీయాలు తీసుకొచ్చిన చంద్రబాబు తర్వాత ప్రోత్సహించడం పూర్తిగా పక్కన పెట్టారు. 2014 ఎన్నికల్లో టికెట్ కోసం కర్రా రాజారావు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నేతల సర్దుబాట్ల లో భాగంగా పీతల సుజాత ను చింతలపూడి నుంచి చంద్రబాబు పోటీ చేయించారు.

దీంతో మనస్థాపం చెంది వైకాపాలో చేరారు.ఆ సమయంలోనే తగిన ప్రాధాన్యత ఇస్తామని నామినేటెడ్ పోస్టు ఇస్తామని చంద్రబాబు చెప్పిన ఆయన మాట మీద నమ్మకం లేకపోవడంతో రాజారావు బయటకు వచ్చారు. అయితే టిడిపి నేతలు పలు రకాలుగా చెప్పడంతో మళ్ళీ టీడీపీలోకి వెళ్లారు.

తర్వాత రాజారావుకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయనను నేతలు పట్టించుకున్న దాఖలాలు లేవు. 2019లో చింతలపూడి నియోజకవర్గం నుంచి నేతలు ఎవరు పోటీ కు సిద్ధంగా లేకపోవడంతో మరో సారి కర్రా రాజారావు చంద్రబాబుకు గుర్తొచ్చారు. 2019లో టిడిపి టికెట్ ను ఇచ్చినా, అప్పటికే ఆయనను నియోజకవర్గ ప్రజలు పూర్తిగా మర్చిపోవడం తో పాటు క్యాడర్ గతి తప్పడంతో భారీ తేడాతో రాజ్యం పాలయ్యారు.

ఇంతేనా పార్టీ బాధ్యత?? Chandrababu

కర్రా రాజారావు గత కొద్ది రోజులుగా ఆరోగ్య విషయంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శాస్త్ర చికిత్స చేసిన పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆసుపత్రిలోనే ఉంటున్నారు. శనివారం ఆయన కు తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆస్పత్రిలోనే కన్నుమూశారు.

ఫోన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి మృతి చెందితే కనీసం పార్టీ తరఫున ఓ నేత ఓ పలకరింపు లేకపోవడం విచారకరం.చంద్రబాబు కూడా ఏనాడు ఆసుపత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న సందర్భం లేదు.ఆర్థికంగా పూర్తిగా చితికిపోయిన రాజారావు చివర్లో ఆస్పత్రి వైద్య ఖర్చులకు ఇబ్బంది పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. కేవలం ఆయన మృతి వార్తను తెలుసుకొని ఒక సంతాప సందేశం తోనే చంద్రబాబు సరిపెట్టారు. పాపం తన ఉద్యోగానికి రాజీనామా చేసి, టీడీపీ ని నమ్మి పూర్తిగా అన్ని విషయాల్లో నష్టపోయిన ఓ నేతకు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఇది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N