NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

జగన్ అనుచరులకు కేసీఆర్ పెద్ద గిఫ్ట్…! ఆ కేసులేమిటో..!?

 

రాజకీయాలలో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్విత మిత్రులు ఉండరు అన్న విషయం అందరికీ తెలిసిందే. వివిధ సందర్భాలలో గొడవలు పడిన వారు ఒకే పార్టీలో కలసి పని చేసి, చేసున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. 2019 ఎన్నికలకు పూర్వం నుండి శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్ లో చంద్రబాబుకు రాజకీయ శత్రువులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి ఏపీ ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మధ్య సయోధ్య కుదిరింది. ఎన్నికలలో అఖండ మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కేసీఆర్, జగన్ మధ్య సన్నిహిత సంభందాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జల వివాదం విషయంలో ఇద్దరి మధ్య చిన్న పేచీలు ఉన్నప్పటికీ ఇద్దరూ కూర్చుంటే చర్చల ద్వారా పరిష్కారం అయ్యేవే నంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు ఒ సుదీర్ఘ కాల పెండింగ్ కేసు విషయంలో కేసీఆర్ ఫేవర్ చేయాలని అనుకుంటున్నారట.

Ys jagan, kcr

 

అది ఏమిటంటే…

2010నాటి మానుకోట కాల్పుల కేసు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2010లో ఓదార్పు యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా మానుకోటకు జగన్ వెళ్లారు. నాడు తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న కారణంగా సమైక్యాంద్రకు మద్దతు పలికిన జగన్ ను మానుకోటలో అడుగు పెట్టనివ్వమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమకారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని నాటి సిఎం కె రోశయ్య కూడా జగన్ కు మానుకోట వెళ్లవద్దని సూచించారట. అయినప్పటికీ జగన్ మానుకోటకు చేరుకున్నారు. జగన్ కు స్వాగతం పలికేందుకు మానుకోట రైల్వే స్టేషన్ వద్దకు నాటి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ నాయకులు కొండా మురళీ, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి చేరుకున్నారు. ఆ సమయంలో వీరిపై తెలంగాణ ఉద్యమ కారులు వీరి ర్యాలీపై రాళ్లు రువ్వడంతో కొండా సురేఖ, మురళీ గన్ మెన్ లు కాల్పులు జరిపారు.

ఆ ఘటనలో 12మంది తెలంగాణ ఉద్యమ కారులకు గాయాలు అయ్యాయి. ఘటన పై తెలంగాణ జేఏసీ ప్రతినిధి డాక్టర్ డోలి సత్యనారాయణ పిర్యాదు మేరకు జగన్ అనుచరులపై కేసులు నమోదు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జగన్ ను, కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకొని అక్కడనుండి తరలించారు. అయితే ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబి సీఐడీకి బదిలీ చేసింది. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసును ముందుకు తీసుకువెళ్లే పరిస్థితి లేదని భావించిన కేసు క్లోజ్ చేసేందుకు గాను ఫిర్యాది దారుడి అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. అయన ఏమి అభ్యన్తరం వ్యక్తం చేయకపోతే ప్రభుత్వం కేసు ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !