Note for Vote Case: ఏం మాయ చేసావు బాబూ..!? ఓటుకి నోటు నుండి తప్పించుకున్నట్టేనా..!?

Note for Vote Case: ED Charge Sheet Special Story
Share

Note for Vote Case: నలభై అయిదేళ్ల రాజకీయంలో చంద్రబాబు తెరిచిన పుస్తకమే.. ఆయనను బాగా గమనిస్తే విశ్లేషకులకు యిట్టె అర్ధమైపోతారు. అతని రాజకీయ స్కిల్స్ తెలుసు. అతని చాణక్యత.., అతని మాటలు మార్పిడి, అతని దాగుడు మూతలు.., అతని అవినీతి స్కిల్స్ చాలా మందికి తెలుసు. మొత్తానికి బాబు రాజకీయాల్లో ఒక ముదురు. ఇన్నాళ్ల రాజకీయంలో తన ముద్ర అందులో ఫుల్లుగా ఉంది.. కానీ ఈ నైపుణ్యంతో పాటూ బాబుకి ఒక వరం కూడా ఉన్నట్టుంది.. అదే తప్పులు చేసి తప్పించుకోవడం.. ఈరోజు ఓటుకి నోటు కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జి సీట్ షీట్ చూస్తే ఈ అనుమానం రాకమానదు.

Must Read Article : ఈనాడు కి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్లు..! కేంద్రం నుండి వార్నింగ్ కూడా!.?

Note for Vote Case: ED Charge Sheet Special Story
Note for Vote Case: ED Charge Sheet Special Story

Note for Vote Case: డబ్బు ఇచ్చి పంపిస్తే తప్పు కాదా..!?

సింపుల్ గా ఒక లాజిక్కు ఆలోచిద్దాం.. తర్వాత మ్యాటర్ లోకి వెళ్దాము.. అనగనగా ఒక సుబ్బయ్య.. ఎన్నికల్లో పోటీకి దిగాడు. ఓట్లను కొనాలి అనుకున్నాడు. అందుకు ఓటర్లకు ఇవ్వడానికి కొంత డబ్బుని తన అనుచరుల ద్వారా పంపించారు. ఆ అనుచరులు అక్కడికి వెళ్లి ఈ సుబ్బయ్యకి ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడించారు. సదరు సుబ్బయ్య “అంత మనోళ్లు చూసుకుంటారు. they briefed me అన్నాడు.. అది ఆధారాలతో సహా బయటకు వచ్చింది. ఆ డబ్బుని ఏసీబీ స్వాధీనం చేసుకుంది. కేసు నమోదు చేసింది. ఇక్కడ తప్పు ఎవరిది..? డబ్బు పంపించి, ఫోన్ లో మాట్లాడిన సుబ్బయ్యదా..? డబ్బు తీసుకెళ్లి ఇచ్చిన అనుచరుడిదా..? సింపుల్ గా ఆలోచిస్తే చట్టం ప్రకారం ఇద్దరిదీ తప్పు ఉన్నట్టే.? కానీ “ఓటుకి నోటు కేసు”లో ఏమిటీ డబ్బులు పంపించిన చంద్రబాబుని నిందితుడుగా చేర్చలేదు..? డబ్బు తీసుకెళ్లిన రేవంత్ రెడ్డిని మాత్రమే చేర్చారు..? ఈ అనుమానం ప్రతీ ఒక్కరికీ రావచ్చు. దానికి సమాధానం కింద పేరాలో సింపుల్ గా చెప్పేసుకుందాం..

Note for Vote Case: ED Charge Sheet Special Story
Note for Vote Case: ED Charge Sheet Special Story

ఆధారాలున్నాయి.. సాక్ష్యాలు లేవు..!

అవును. ఏదైనా నేరం నిరూపించాలి అంటే ఆధారాలు ఉంటె చాలదు. సాక్ష్యాలు కూడా ఉండాలి. ఓటుకి నోటు కేసులో చంద్రబాబు ఆధారాలతో సహా దొరికారు. డబ్బు అతనిదే.., వాయిస్ అతనిదే అని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. వీడియో, ఆడియోలో దొరికిపోయారు. ఆధారాలన్నీ చంద్రబాబు దోషిగా తెలుస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి లాంటి ఒక్కడు చాలు.. ఈ కేసులో మొత్తం రేవంత్ రెడ్డి కీలకం. అతని చుట్టూనే వ్యవహారం తిరిగింది. విచారణ సందర్భంగా రేవంత్ రెడ్డి నోరు విప్పి.. ఈ డబ్బు చంద్రబాబు పంపించారు. ఆయనే మాట్లాడారు అని చెప్పి ఉంటె కేసు మరోలా ఉండేది. కానీ రేవంత్ మొత్తం తన నెత్తి మీద వేసుకున్నారు. డబ్బు తనదే.. తనే ఓటు కొనాలని చంద్రబాబుకి చెప్పాను. ఆయనకు ఇష్టం లేదు. అది ఆయన వాయిస్ కాదు. ఇలా పక్కాగా వ్యతిరేకంగా చెప్పారు. అంటే ఆధారాలతో దొరికిన చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం దొరకలేదు. దాదాపు ఆరేళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఈ కేసులో చంద్రబాబుకి వ్యతిరేకంగా మంచి సాక్ష్యం దొరకలేదు. అది చంద్రబాబు మేనేజ్మెంట్ స్కిల్ కి ప్రతీక. తప్పు చేసి.. దాన్ని రూపుమాపుకునే క్రమంలో తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేశారు. అటు రేవంత్ రెడ్డి కూడా పార్టీ మారినప్పటికీ చంద్రబాబు పట్ల అత్యంత కృతజ్ఞుడూగా మెసులుకుంటున్నారు. అలా ఆధారలతో దొరికినా సాక్ష్యాలు లేవు కాబట్టి ఈడీ ఈరోజు ఇలా చేసింది. ఈ కేసులో రేవంత్ రెడ్డిని ప్రధాన దోషిగా తేల్చింది. చంద్రబాబుని అసలు ఛార్జ్ షీట్ లో ఎంటర్ చేయలేదు. కానీ ఈ కేసు తెరిచే ఉంటుంది. ఏసీబీ కోర్టులో, సుప్రీమ్ ద్వారా చంద్రబాబుకి కొన్నాళ్ళు చిక్కులు తప్పకపోవచ్చు..


Share

Related posts

బాబు గారూ మరోసారి మీటైమ్ బ్యాడ్ నడుస్తోంది…!

Special Bureau

వైసిపి నేతల్లో ఉత్కంఠ

somaraju sharma

అరెస్టులపై టీడీపీలో ఏం చర్చ జరుగుతుందంటే…!

Srinivas Manem