NewsOrbit
రాజ‌కీయాలు

కాపు ఉద్యమంలో పొలిటికల్ హీట్..! రంగంలోకి వంగవీటి..!

AP Political News: Interesting Gossip Internal Facts

రాష్ట్రంలో కాపు ఉద్యమం మరోసారి ఊపిరి పోసుకోనుందా! ముద్రగడ తర్వాత కాపులకు నాయకత్వం వహిస్తూ.. ఉద్యమాలు చేస్తూ.. కాపులను ఒక్కతాటిపైకి తీసుకొచ్చే నాయకుడు ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాపులపైనే పోరాడతారా..? లేదా బలిజల తరపున పోరాడతారా అనేది కీలకం. నేడు ఓ భేటీ జరగనుంది. ఈ భేటీకి వంగవీటి రాధా, ఓవీ రమణ నాయకత్వం వహించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారని తెలుస్తోంది.

vangaveeti radha leads kapu movement
vangaveeti radha leads kapu movement

జగన్ కు వ్యతిరేకంగా పావులేనా..

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా ఏపీలో టీడీపీ అధినేత అప్పటి సీఎం కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానించారు. జగన్ సీఎం అయ్యాక ఈ బిల్లు అమలుకు నోచుకోలేదు. ఈ బిల్లును అమలు చేయాలని కోరుతూ వీరు ఉద్యమం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యమం నుంచి ముద్రగడ తప్పుకోవడంతో ఎవరు ఇందుకు నేతృత్వం వహిస్తారనే ప్రశ్నలకు రాధా రూపంలో సమాధానం వచ్చేట్టు ఉంది. మరి రాధా తన శైలి, తీరుతో ఉద్యమాన్ని ఏమేరకు ముందుండి నడిపిస్తారో ప్రశ్నార్ధకమే. అయితే.. ఇదంతా రిజర్వేషన్ కోసమా సీఎం జగన్ కు వ్యతిరేకంగా జరుగుతోందా అనేది తెలియాల్సి ఉంది.

ఉద్యమం వెనుక చంద్రబాబు ఉన్నట్టా లేనట్టా..

ఈ ఉద్యమం వెనుక సూత్రధారి చంద్రబాబేనా.. అనే ఊహాగానాలు లేకపోలేదు. ఇప్పటికే రాజధాని అంశంలో రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు కాపుల రిజర్వేషన్ అంశాన్ని కూడా తీసుకొచ్చి జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనే రాజకీయ వ్యూహాలు పన్నుతున్నారా అనేదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే.. ఉద్యమం మాత్రం జరిగే సూచనలు మాత్రం కనిపిస్తున్నాయి.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?