NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం ! జగన్ ప్రభుత్వం ప్రకటనతోనే అదరగొట్టింది!

రేషన్ కార్డు అనేది పేదవాడికి తీరని కల అయిన నేపథ్యంలో దాన్ని సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.దరఖాస్తు చేసుకున్న ఐదు రోజుల్లోనే అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చేలా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.ఇంతకు ముందే ఈ విధానాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పుడు దానికి పూర్తిస్థాయి యంత్రాంగాన్ని సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఈ నెల ఆరవ తేదీ నుండి ఈ నూతన విధానం అమల్లోకి రానున్నది.

రేషన్ కార్డు లేని నేపథ్యంలో అనేకమంది పేదలు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకోలేకపోతున్నారని స్పందన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన ఈ విషయంలో శ్రద్ధ చూపారు.కేవలం రేషన్ దుకాణాల్లో సబ్సిడీ ధరలకు నిత్యావసరాలు పొందడమే కాకుండా అనేక సంక్షేమ పథకాల్లో సైతం రేషన్ కార్డు నెంబరు పొందుపర్చటం తప్పనిసరి.కానీ రాష్ట్రంలో చాలా మందికి రేషన్ కార్డులు లేకపోవటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించారు.దీనిపై ఆయన ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకుని అధికారులను పరుగులెత్తించారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న ఐదు రోజులకే రేషన్ కార్డు జారీ చేసే విధానానికి రూపకల్పన జరిగింది.గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ విధాన౦ లో రేషన్ కార్డు పొందే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.

అంతేకాకుండా రేషన్ డోర్ డెలివరీ కి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు మొదలెట్టింది.ఇందులో భాగంగా రేషన్ బియ్యాన్ని తెచ్చివడానికి వీలుగా సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేయబోతోంది.ఇంట్లో ఉండే రేషన్ కార్డు దారుల సంఖ్యను బట్టి పది ,పదిహేను కిలోలు ఇవ్వడానికి వీలుగా సంవత్సరం మొత్తానికి సరిపడేటట్లు పన్నెండు సంచులను ప్రభుత్వం అందిస్తుంది.ఈ సంచుల తయారీకి ఒక్కొక్కదానికి ఇరవై అయిదు రూపాయల ఖర్చుకానుండగా దాన్ని కూడా ప్రభుత్వం భరించబోతోంది.ఇంతవరకు ఎన్నో సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసినప్పటికీ రేషన కార్డుల విషయంలో చేపట్టబోతున్న చర్యలు ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరుస్తాయని చెప్పవచ్చు.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N