NewsOrbit
Cinema Entertainment News రివ్యూలు సినిమా

Salaar: ప్రభాస్ అభిమానుల ఆకలి తీర్చిన ప్రశాంత్ నీల్.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట “సలార్” మూవీ రివ్యూ..!!

Salaar: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన “సలార్” సినిమా నేడు విడుదలయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ నెలలోనే విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ అయింది. “బాహుబలి” లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు పరాజ్యమయ్యాయి. దీంతో “కేజిఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా చేయటంతో.. కచ్చితంగా ప్రభాస్ హిట్ కొడతారని ఫ్యాన్స్ ఎదురు చూడటం జరిగింది. మరి నేడు విడుదలైన “సలార్” సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం.

సినిమా : సలార్
నటీనటులు: ప్రభాస్‌, శృతిహాసన్‌, పృథ్విరాజ్‌ సుకుమారన్‌, జగపతిబాబు, బాబి సింహా, టిన్ను ఆనంద్‌, ఈశ్వరీరావు, శ్రీయారెడ్డి, ఝాన్సీ, బ్రహ్మాజీ, షఫీ, పృథ్వి, జాన్‌ విజయ్‌ తదితరులు
సినిమాటోగ్రఫీ: భువన్‌ గౌడ
సంగీతం: రవి బస్రూర్‌
ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి
నిర్మాత: విజయ్‌ కిరగందూర్‌
బ్యానర్‌: హోంబలే ఫిలింస్‌
రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌
విడుదల తేదీ: 22 డిసెంబర్‌, 2023
సినిమా నిడివి: 175.16 నిమిషాలు

Full review of Prabhas Salaar movie which became a hit after five years

పరిచయం:

ప్రపంచవ్యాప్తంగా “సలార్” సినిమా కోసం సినిమా ప్రేక్షకులు ఎంతగానో ఆశకు ఎదురుచూస్తున్నారు. కారణం ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఎత్తు అయితే.. మరొక విడుదల చేసిన రెండు ట్రైలర్ లు. “కేజిఎఫ్” దర్శకుడు ప్రభాస్ తో సినిమా అనగానే ప్రపంచవ్యాప్తంగానే ఈ ప్రాజెక్టుపై మొదట్లోనే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అయిందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.

స్టోరీ:

మొదట ట్రైలర్ లో తెలియజేసినట్టుగానే సినిమాలో దేవా (ప్రభాస్), వరదరాజమన్నార్(పృధ్విరాజ్ సుకుమారాన్) ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరి కోసం మరొకరు ఎలాంటి త్యాగం చేయడానికి అయినా వెనుకాడరు. వరద కోసం ఏం చేయడానికైనా దేవా వెనుకాడడు. అయితే అనుకోని కారణాలవల్ల వీరిద్దరూ విడిపోవలసి వస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి అవసరం వచ్చినా తాను వస్తానని వరదకు దేవా చెప్పడం జరుగుద్ది. ఈ రకంగా బాల్యంలో 1995 నాటి నుంచి అస్సాం ప్రాంతంలో స్టోరీ మొదలవుతుంది. దేవా అక్కడ ఓ ప్రాంతంలో బొగ్గు గనిలో పనిచేస్తూ ఉంటాడు. దేవా మరియు తన తల్లి రహస్యంగా ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు. ఇక అదే ప్రాంతంలో ఆద్య (శృతిహాసన్) టీచర్ గా పని చేస్తూ ఉంటది. అంతకుముందు ఆధ్య వాళ్ల కుటుంబస్తులు విదేశాలలో ఉండేవారు. అయితే ఆధ్యా కుటుంబం పై రాధారమ (శ్రేయ రెడ్డి) పగతో రగిలిపోతుంటది. అలాంటి సమయంలో ఆద్య తండ్రి కృష్ణకాంత్ తో కలసి ఇండియాలో అడుగుపెట్టి టీచర్ జాబ్ చేస్తూ ఉంటది. ఈ క్రమంలో రాధారమ… కృష్ణ కాంత్ కుటుంబం ఇండియాకి వచ్చిందని తెలుసుకొని.. ఉండాలని పంపించి.. ఆద్యనీ పట్టుకు రావాలని తెలియజేస్తది. ఈ క్రమంలో రౌడీలు ఆద్యనీ కిడ్నాప్ చేసి ఎత్తుకెళుతుండగా దేవా కాపాడుతాడు. సరిగ్గా అదే సమయంలో దేవా ఫ్రెండ్ వరదరాజు… చాలాకాలం తర్వాత దేవాని వెతుకుని అక్కడికి వస్తాడు. ఇంకా సినిమా అక్కడి నుంచి రకరకాల మలుపులు తిరుగుతూ వెళుతుంది. అసలు అస్సాంలో దేవా తన తల్లితో కలిసి ఎందుకు ఉండాల్సి వచ్చింది..? భారత్ సరిహద్దుగా ఉన్న ఓ అటవి ప్రాంతం ఖాన్సర్ గా సామ్రాజ్యంగా ఎలా మారింది..? ఆ ప్రాంతాన్ని పాలించే మన్నార్ వంశానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి..? ఖాన్సర్ ప్రాంతంలో సీజ్ కేస్ ఒప్పందాన్ని ఎత్తయడానికి ఎందుకు ఓటింగ్ పెట్టారు..? ఆ ఓటింగ్ జరుగుతున్న సమయంలో దేవాని వెతుక్కుంటూ వరదరాజు ఎందుకు వచ్చాడు..? దేవా కాలాంతకుడిగా ఎందుకు మారాడు..? దేవా కి సలార్ అనే పేరు ఎలా వచ్చింది..? ఓటింగ్ లో ఎవరు గెలిచాడు వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

Full review of Prabhas Salaar movie which became a hit after five years

విశ్లేషణ:

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ మరియు దర్శకత్వం యొక్క స్టామినా “కేజిఎఫ్” రెండు భాగాలలో అందరికీ తెలిసిందే. ప్రేక్షకుడికి సినిమాపై క్వశ్చన్ మార్క్ కలిగేలా తీస్తూ మరో పక్క ట్విస్టులతో ఆ సందేహాలను నివృత్తి చేసేలా కథనాన్ని “కేజిఎఫ్” సినిమాలో నడిపించడం మనం చూశాం. సరిగ్గా ఇప్పుడు అదే విధంగా “సలార్” సినిమాలో కూడా.. ఫస్టాఫ్ చాలా వరకు.. వైలెంట్ గా వెళ్తున్న గాని ప్రేక్షకులు కొద్దిగా కన్ఫ్యూజన్ గురవుతాడు. ఆ సందేహాలు పూర్తిగా సెకండాఫ్ లో నివృతం అవుతాయి. ఈ యాక్షన్ స్టోరీ డ్రామాలో భాగంగా ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ పాత్రలను.. ప్రశాంత్ నీల్ అద్భుతంగా మలిచాడు. ఒకరకంగా చెప్పాలంటే “కేజిఎఫ్” సినిమాని మించిపోయేలా ఈ సినిమా కథనం ఉంటుంది. సరిగ్గా ప్రభాస్ కటౌట్ కి తగ్గ కథ. ప్రభాస్ అద్భుతమైన నటనతో పాత్రలో ఇమిడిపోయాడు. అదేవిధంగా పృథ్వీరాజ్ మరియు శృతిహాసన్, ఈశ్వరి రావు, జగపతిబాబు నటించారు. ఊహకందని ట్విస్టులు.. సినిమాలో చాలా చోటు చేసుకుంటాయి. ఈ సినిమాకి రెండో భాగం ఉండటంతో కొన్ని పాత్రలకు సంబంధించిన అనుమానాలు ప్రేక్షకుడికి ఇంకా ప్రశ్నార్ధకంగానే డైరెక్టర్ వదిలిపెట్టేయటం జరిగింది. దీంతో రెండో భాగంపై ఇంట్రెస్ట్ మరింత గలిగేలా క్లైమాక్స్ లో భారీ ట్విస్ట్ రివిల్ చేయడం జరిగింది. టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ బాగా ప్లస్ అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా.. కథకి తగ్గట్టు ప్రేక్షకుడిని సినిమాలో అంతర్లీనం చేసే విధంగా ఉంది. మరి ముఖ్యంగా సినిమాకి యాక్షన్ సీన్స్ హైలైట్ అని చెప్పాలి. ప్రభాస్ నీ బాహుబలి, చత్రపతి సినిమాలో రాజమౌళి చూపించిన దానికంటే డబల్ త్రిబుల్ గా “సలార్” సినిమాలో.. చాలా వైలెంట్ గా ప్రశాంత్ నీల్ చూపించారు. ముఖ్యంగా సెకండాఫ్ లో ప్రభాస్ రక్తపాతాన్ని సృష్టించాడని చెప్పవచ్చు. సినిమాలో చివరిగా ఇచ్చిన ట్విస్ట్ ఇప్పుడు రెండో భాగంపై ప్రేక్షకుడికి మంచి ఇంట్రెస్ట్ కలిగించేలా చేయడం జరిగింది.

ఓవరాల్ గా: దాదాపు 5 సంవత్సరాల తర్వాత డైనోసార్ మాదిరిగా బాక్సాఫీస్ మీద ప్రభాస్ “సలార్” సినిమాతో దండయాత్ర స్టార్ట్ అయింది అని చెప్పవచ్చు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu