Sashi Review : ఆది సాయికుమార్, సురభి జంటగా నటించిన చిత్రం ‘శశి‘. శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అరుణ్ చిలువేరు బాణీలు అందించారు. ఆర్ పి వర్మ, రామాంజనేయులు. చింతలపూడి శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం….
Sashi Review : కథ
రాజ్ (ఆది సాయి కుమార్) అసలు జీవితంలో ఎలాంటి సీరియస్నెస్ లేకుండా చాలా చలాకీగా ఉండే కుర్రాడు. ఇక అతని కుటుంబం బాధ్యత మొత్తం అన్న అజయ్ (అజయ్) నిర్వర్తిస్తుంటాడు. రాజ్ కు భవిష్యత్తు మీద భయం లేదు కానీ మ్యూజిక్ అంటే బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. అలాగే శశి (సురభి) తో ప్రేమలో పడతాడు. అయితే సాఫీగా సాగుతున్న అతని లవ్ స్టోరి లో శశి కి అనుకోని ఇబ్బందులు రావడం వల్ల టర్న్ అవుతుంది. రాజ్ కి కూడా ఆమెను ఇబ్బందులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్యలను శశి తో కలిసి రాజ్ ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథాంశం.
ప్లస్ పాయింట్స్
- ఈ సినిమాలో ఆది పెర్ఫార్మెన్స్ బాగుంది. అతని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో మరింత పరిణితి కనబరిచాడు. సురభి కూడా తను గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లో కూడా మెప్పించగలను అని ప్రూవ్ చేసుకుంది.
- ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ అయినా రాశి సింగ్ పాత్ర బాగుంది. కమెడియన్స్ హర్ష, వెన్నెల కిషోర్ కొద్దిసేపు నవ్వులు పూయించారు.
- రాజీవ్ కనకాల స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి మరో ప్లస్ పాయింట్. సినిమాలో కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాలు బాగా వచ్చాయి.
మైనస్ పాయింట్స్
- కథ బాగానే ఉన్నప్పటికీ రెండవ అర్ధ భాగంలో నరేషన్ అస్సలు బాగోలేదు. చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా ఉన్నాయి. కథ ఏమో ఒరిజినల్ కంటెంట్ డిమాండ్ చేసింది.
- Drama క్రియేట్ చేయడానికి కథలో కావలసినంత స్కోప్ ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ మీద ఫోకస్ పెట్టిన డైరెక్టర్ సినిమాను ఇంట్రెస్టింగ్ గా తీయలేకపోయాడు.
- సినిమా స్టోరీలైన్ బలమైన అయినప్పటికీ దానిని హైలైట్ చేయలేకపోయారు. అంతేకాకుండా సినిమా కూడా చాలా స్లోగా సాగుతుంది.
- హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మరింత బాగా రాసుకోవలసిది. కథ బాగానే ఉన్నప్పటికీ వారిద్దరి స్వభావాలు పూర్తిగా ప్రేక్షకులకు క్లారిటీ రాలేదు.
Sashi Review : రివ్యూ
రొమాంటిక్ డ్రామా జోనర్ లా తెరకెక్కిన ‘శశి‘ మంచి స్టోరీ లైన్ తో మొదలవుతుంది. అయితే నరేషన్ మాత్రం సక్రమంగా సాగదు. అలాగే సినిమాలో మెయిన్ పాయింట్ కూడా అంత బలంగా లేదు. సీన్స్ అన్నీ సినిమాటిక్ గా ఉన్నాయి. నటీనటులు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ సినిమాలో పెద్దగా చెప్పుకోవడానికి ఎలిమెంట్స్ కూడా ఏమీ లేవు. ఈ సినిమాను చాలా ఈజీగా స్కిప్ చేసెయ్యొచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!