ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ హితమైనవి.. మనం ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు దిశగా అడుగులు వేస్తున్నాం.. అయితే చార్జింగ్ మధ్యలో ఎక్కడ అయిపోతుందేమోనని సంకోచంతో..? ఈ వాహనాలను కొనేందుకు ఒక అడుగు వెనక్కు వేస్తున్నాం..? ఇప్పుడు ఆ సమస్యను కూడా అధిగమించడానికి అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ ఆప్టెరా మోటార్స్ సోలార్, విద్యుత్ శక్తి తో నడిచే త్రీ వీలర్ కార్ ను మార్కెట్లో ప్రవేశపెట్టింది..దీనిని కంపెనీ నెవర్ ఛార్జ్ టెక్నాలజీ గా సూచించింది..!
సోలార్ శక్తిని మాత్రమే ఉపయోగించి డ్రైవింగ్ చేయగల సామర్ధ్యం ఉన్న మొదటి వాహనంగా కంపెనీ తెలిపింది. ఈ కారు 3.5 సెకండ్లలో గంటకు 60 మైళ్ళు ప్రయాణింస్తుంది. దీని టాప్ స్పీడ్ 110 ఎంపిహెచ్. ఈ కారు 4.4 మీటర్ల పొడవు, 2.2 మీటర్ల వెడల్పు, 1.4 మీటర్ల ఎత్తు తో తయారు చేశారు. ఈ మూడు చక్రాల కారు వాహనంలో ఇద్దరు పిల్లలు, ఒక పెంపుడు జంతువుతో ప్రయాణించవచ్చు.
ఈ నెవర్ ఛార్జ్ టెక్నాలజీ కారు డ్రైవర్లు చార్జింగ్ కోసం చార్జింగ్ స్టేషన్లో ఆపకుండా తమ ప్రయాణాలను పూర్తి చేస్తుంది. ఒక రోజులో ఎంత దూరం ప్రయాణిస్తున్నారు అనే దానిపై ఆధారపడి వారిని ప్రతి సారి సోలార్ కార్ ఛార్జింగ్ చేయనవసరం లేకుండా చేస్తుంది. దీనిని బట్టి మీ సమయం తో పాటు ప్రయణాలను కొనసాగించవచ్చు.