బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకున్న కారణంగా ఇంటిలో హై వోల్టేజ్ పరిస్థితులు నెలకొన్నాయి. సోహెల్, అరీయానా ల మధ్య జరిగిన గొడవ ఈ వీక్ మొత్తం హైలైట్గా నిలిచింది. అరీయానా కి సంబంధించిన బొమ్మను సోహెల్ పాడు చేయడం అరీయానా నాకు చాలా కోపం తెప్పించింది. అయితే సోహెల్ మనుషులకు ఇచ్చే విలువ ఉండాలని బొమ్మలపై ఇష్టం పెంచుకోవడం మనుషులపై ఇష్టం పెంచుకోవడం ఒకటి కాదని చెప్పాడు. దీంతో వీరిద్దరి మధ్య చాలా పెద్ద వాగ్వాదం జరిగింది.
నెటిజన్లు కూడా కొందరు సోహెల్ కు మద్దతు ఇస్తే మరికొందరు అరీయానా వైపు మాట్లాడారు.ఇక ఈరోజుటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున వారిద్దరికీ క్లాస్ పీకి నట్లు అర్థం అవుతుంది. సోహెల్ కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోవడం పై నాగార్జున మండిపడ్డాడు. మరోవైపు సోహెల్ మూడవ మనిషిని ముందు అరియనా తీసుకొని వచ్చింది. హారిక విషయంలో అప్పుడు అలా చేసావు అని నన్ను నిందించింది అని కంప్లైంట్ చేసాడు.
నాగార్జున ఈ విషయంలో సోహెల్ కు మద్దతు పలకడం చూడవచ్చు. అరీయానా నువ్వు ఉమెన్ కార్డు వాడవు అని మందలించాడు. అయితే ఇప్పుడు నెటిజన్లు కొత్త టాపిక్ ను తెర మీదకి తెచ్చారు. గతంలో ఇలాగే ఆడవారిపై సోహెల్ విరుచుకుపడినప్పుడు ఇంట్లో ఆడవారిని ఒక్క మాట అన్నా ఇదే జరుగుతుంది అని కొరడా ఝలిపించాడు. అయితే ఇప్పుడు నాగార్జున అరీయానా పై రెచ్చిపోయిన సోహెల్ ను సమర్థించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ దీంతో మరింత ఆసక్తిగా తయారయింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!