KCR: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్‌కు ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?

Share

KCR: తొలుత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్, అనంత‌రం తెలంగాణ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గుర్తున్నారా? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ఓ కీల‌క స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఈ విష‌యం చాలా ఆల‌స్యంగా ప్ర‌స్తుతం వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా ఆ విష‌యాన్ని స్వ‌యంగా సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. మాజీ మంత్రి, బీజేపీ నేత‌ పెద్దిరెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కార్యక్రమాలు రూపొందిస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. ఒక ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలంటే అనుకున్న ప్లానింగ్ అమలు చేయాలని పేర్కొంటూ ఈ సంద‌ర్భంగా ఆనాటి ఉదంతాల‌ను ప్ర‌స్తావించారు.

Read More : KCR: కేసీఆర్‌కు షాక్‌.. హుజురాబాద్‌లో మారిపోతున్న సీన్‌…


అప్పుడేం జ‌రిగిందో చెప్పిన కేసీఆర్‌…
ఒక పథకం ప్రారంభించామంటే.. దాని ఫలితం, ప్రతిఫలం, భవిష్యత్ ఫలాలు ఊహించి పకడ్బందీగా ప్లాన్ చేస్తేనే అభివృద్ధి అవుందని కేసీఆర్ తెలిపారు. 2014 ఎన్నికల కంటే ముందు చాలామందికి తెలంగాణ రాష్ట్రం వస్తుందన్న నమ్మకమే లేదని కేసీఆర్ అన్నారు. “తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కానుందని నేను చాలా స్పష్టంగా చెప్పిన. . టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని. ముందుగానే మేనిఫెస్టో తయారు చేయాలని చెప్పడం జరిగింది. అప్పటికి తెలంగాణ అనేది ఒక రాష్ట్రంగా లేదు. రాష్ట ఎట్ల నడవాలి? ఆదాయం ఎంత? వనరులేంటి అనేది అప్పటికి స్పష్టత లేదు. అయినా తాము వ్యూహాత్మ‌కంగా ముందుకు సాగాం“ అని కేసీఆర్ ఆనాటి ఉదంతాల‌ను గుర్తు చేశారు.

Read More : KCR: రిటైరైన వారికి మ‌ళ్లీ ఉద్యోగం.. ఇది కేసీఆర్ స‌ర్కారులోనే సాధ్యం.


కార్లు మార్చిన‌ప్పుడు ఏం చేశామంటే…
రాష్ట్రం వ‌చ్చిన కొత్త‌లో కార్లు మార్చిన ఉదంతాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. “అప్పటికి పాత సీఎం వాడిన కార్లు నల్లగ ఉండేవి. నాకు నల్లరంగు నచ్చదు. మా ఐజీ అధికారిని సలహా అడిగితే.. కొత్త కార్లు కొందాం సార్ అన్నరు. కానీ అప్పుడప్పుడే కొత్త సంసారం. కొత్త కార్లు కొనే పని లేకుండా ఏమైనా ఆలోచనా ఉందా అని అడిగితే.. ఆయన నల్ల కలర్ తీసేశి.. తెల్ల కలర్ వేయ‌వ‌చ్చు సార్ అని సలహా ఇచ్చిండు. ఉన్న కార్లన్నీ మూడోకంటికి తెల్వకుండా షెడ్డుకు పంపి తెల్లకలర్ వేయించాం. ఈ విషయం అప్పటి గవర్నర్ నరసింహన్ గారికి తెలిసి.. ఏంటండీ సీఎం గారూ.. మీరు చాలా పిసినారి ఉన్నరు. నల్ల కలర్ తీసివేసి.. తెల్ల కలర్ వేయ‌డం కంటే కొత్త కార్లు కొనుక్కోవచ్చు కదా అన్నారు. ఇప్పటి పరిస్థితులల్ల కొత్త కార్లు ఎందుకు సార్. కొంతకాలం తర్వాత చూద్దాం అని చెప్పాను“ అంటూ ఆనాటి ప‌రిస్థితుల‌ను ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు.


Share

Related posts

YSRCP – TDP : ఆత్మస్థైర్యం… టీడీపీకీ వైసీపీకి తేడా ఇదే..!!

Srinivas Manem

బాబు మాటలు పెడచెవిన పెట్టిన తెలుగు తమ్ముళ్ళు ! ఏ విషయంలో??

Yandamuri

Weight Loss: ఇడ్లీ సాంబార్ తింటే బరువు తగ్గుతారా..!! ఎప్పుడు తినాలంటే..!?

bharani jella