NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ పై ఈసికి కీలక డిమాండ్ చేసిన మాజీ ఐఏఎస్ అకునూరి మురళి

Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అర్జాల బావి సమీపంలోని గోడౌన్ లో రేపు ఉదయం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నెల 3వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక డిమాండ్ చేశారు. మునుగోడు ఎన్నికల ఓట్ల లెక్కింపు తక్షణం నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మునుగోడులో విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఈసీకి డిమాండ్ చేశారు.

Akunuri Murali

మునుగోడు ఎన్నికల్లో పార్టీలు డబ్బులు పంచిన రుజువులు సోషల్ మీడియాలో చాలా వచ్చాయని ఆయన అన్నారు. ఓట్ల లెక్కింపును తక్షణం నిలుపుదల చేసి జరిపిన ఎన్నికలను రద్దు చేయాలని ఆయన ఈసీని డిమాండ్ చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని ఆపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. సోషల్ మీడియాలో ఆయన ట్వీట్, వీడియో వైరల్ అయ్యింది. కాాగా  తెలంగాణలో ఐఏఎస్ అధికారిగా సేవలు అందించిన ఆకునూరి మురళి స్వచ్చంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయనను ఏపి సర్కార్ ప్రభుత్వ సలహాదారు ( ప్రాధమిక విద్యాశాఖ మౌళిక సదుపాయాలు)గా నియమించింది. మూడేళ్లుగా ఆయన పాఠశాల విద్యాశాఖలో మౌళిక సదుపాయాల సలహాదారుగా బాధ్యతలు నిర్వహించారు.

Munugode Bypoll

 

అయితే నెల రోజుల క్రితం ప్రభుత్వ సలహాదారు పదవికి ఆయన రాజీనామా చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయనీ, అక్కడి పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందని భావిస్తున్నానని అందుకే రాజీనామా చేస్తున్నట్లు సీఎం జగన్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు ఆకునూరి మురళి. త్వరలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని వార్తలు వినబడుతున్నాయి. అమ్ ఆద్మీ పార్టీ లో గానీ, లేక బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) లో గానీ చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కేసిఆర్ సర్కార్ పై తీవ్ర స్థాయి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు ఆయన మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ లను విమర్శిస్తూ ఆరోపణలు చేయడం విశేషం.

Munugode Bypoll: కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు .. రేపు తేలనున్న మునుగోడు ఉప ఎన్నిక విజేత

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju