Nandamuri Balakrishna: తెలంగాణ మంత్రి హరీష్ రావుతో నందమూరి బాలకృష్ణ భేటీ..ఎందుకంటే..

Share

Nandamuri Balakrishna: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని మంత్రి ఛాంబర్ లో వీరు సమావేశమై 15 నిమిషాల పాటు చర్చించారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా బాలకృష్ణ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో మరింత ఎక్కువ మంది రోగులకు సేవలు అందించేందుకు నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగో డే కేర్ యూనిట్ ను బాలకృష్ణ ప్రారంభించారు. ఆసుపత్రిలో ఇప్పటికే మూడు డే కేర్ యూనిట్ లు అందుబాటులో ఉండగా తాజాగా అందుబాటులోకి వచ్చిన సదుపాయంతో డే కేర్ చికిత్సకు 181 పడకలు అందుబాటులోకి వచ్చాయని ఆసుపత్రి వర్గాలు తెలిపారు.

Nandamuri Balakrishna met minister Harish Rao

Nandamuri Balakrishna: అత్యుత్తమ ఆసుపత్రి జాబితాలో బసవతారకం ఆసుపత్రి

ఆరోగ్య శ్రీ కింద సేవలు పొందుతున్న వారికి పడకలు ఇప్పటికే పెంచినట్లు బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రిలోని సదుపాయాలను పరిశీలించిన నీతి ఆయోగ్ ..దేశంలోనే అత్యుత్తమ ఆసుపత్రిగా గుర్తించినట్లు బాలకృష్ణ తెలిపారు. ఈ తరుణంలో నందమూరి బాలకృష్ణ మంత్రి హరీష్ రావుతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మంత్రి హరీష్ రావుతో ఏ విషయాలపై చర్చించారు అనే విషయాలు ఇంకా బయటకు రాలేదు.

ఓ పక్క అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా, మరో పక్క నటుడుగా సినిమాల్లో నటిస్తూ, అటు బసవతారకం ఆసుపత్రికి చైర్మన్ గా బాలకృష్ణ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా షూటింగ్ ల ద్వారా బిజీగా  ఉన్నప్పటికీ ఆసుపత్రిపై బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారనేది అందరికీ తెలిసిందే. వీలు దొరికిన సమయంలో తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు బాలకృష్ణ.

Breaking: ఏపిలో నైట్ కర్ఫ్యూ..కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు..!!


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

35 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

37 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago