NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

PM Modi: ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందన్న ప్రధాని మోడీ

Share

PM Modi: వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న ప్రభుత్వం ఏర్పడుతుందని బీజేపీ శ్రేణులు భరోసా కల్పించారని అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడి. పాలమూరు వేదికగా శాసనసభ ఎన్నికల సమర శంఖాన్ని బీజేపీ పూరించింది. పాలమూరు ప్రజాగర్జన బహిరంగ సభలో పాల్గొని ప్రధాన మంత్రి మోడీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికారు. మహబూబ్ నగర్ లో తొలుత అధికారిక కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆనంతరం ఓపెన్ టాప్ జీపుపై ప్రజలకు అభివాదం చేస్తూ రెండో వేదికైన పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానికి మహిళలు నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ చెప్పింది చేసే ప్రభుత్వం రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేసారు. తెలంగాణ ప్రజలకు ఈరోజు శుభదినమన్నారు. రాష్ట్రంలో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామన్నారు. కేంద్రం చేపట్టే ప్రాజెక్టులతో ప్రజలకు భారీగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ బీజేపీకి అండగా నిలుస్తున్నారన్నారు.  ప్రజల్లో కనిపిస్తున్న ఉత్సహం చూస్తుంటే .. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి రహిత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు.

ఈ సందర్భంగా కేసీఆర్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ సర్కార్ మజ్లిస్ చేతిలో ఉందని విమర్శించారు. ప్రభుత్వాన్ని నడిపే కారు స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందో ప్రజలకు తెలుసునని అన్నారు. అవినీతి, కమీషన్ల కు పేరుగాంచిన ఆ రెండు కుటుంబాలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని విమర్శించారు మోడీ. సామాన్య ప్రజానీకం గురించి ఆ కుటుంబాలకు ఎలాంటి ఆలోచన లేదన్నారు. ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు మాదిరిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని మోడీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలోనే తెలంగాణలో 2500 కిలో మీటర్ల హైవేలు నిర్మించిందన్నారు.

ఎలాంటి ష్యూరిటీ లేకుండా ముద్ర బ్యాంక్ ద్వారా వీధి వ్యాపారులకు రుణాలు ఇస్తున్నామన్నారు. 2014 కు పూర్వం ధాన్యం కొనుగోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే ఇవ్వగా, బీజేపీ ప్రభుత్వం రూ.27వేల కోట్లు ఇస్తొందన్నారు. తెలంగాణ రైతులను రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తొందని విమర్సించారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి లబ్దిపొందిన సర్కార్ ఆ తర్వాత రైతులను విస్మరించిందని మోడీ విమర్శించారు.

Telangana Congress: బీఆర్ఎస్ నుండి తండ్రీ తనయుల కాంగ్రెస్ ఎంట్రీ ఫలితం .. కాంగ్రెస్ పార్టీకి మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి రాజీనామా  


Share

Related posts

‘సాక్షి’పై లోకేశ్ గరం గరం!

Mahesh

సీతాఫలం గురించి తెలిస్తే మీరు అస్సలు వదలరు!!

Kumar

బ్రేకింగ్: సీఎం వైఎస్ జగన్ ను కలిసిన వాసుపల్లి గణేష్

Vihari