NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

PM Modi: తెలంగాణకు ప్రధాని మోడీ హామీల వర్షం .. పసుపు బోర్డు, గిరిజన వర్శిటీలకు హామీ

Share

PM Modi: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు హామీల వర్షం కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర ఆదివారం తెలంగాణ పర్యటనలో భాగంగా మహబూబ్ నగర్ లో జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తొలుత నా కుటుంబ సభ్యులారా చాలా సంతోషంగా ఉందంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ .. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.

పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా తర్వాత పసుపు గొప్పతనం ప్రపంచానికి తెలిసిందనీ, పసుపుపై పరిశోధనలు పెరిగాయని మోడీ అన్నారు. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అలానే రాష్ట్రానికి కేంద్ర గిరిజన యూనివర్శిటీ మంజూరు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు  జిల్లాలో సమ్మక్క – సారక్క ట్రైబల్ యూనివర్శిటీ పేరుతో దీన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశామన్నారు. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముందని అన్నారు. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించామని అన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయని చెప్పారు. కొత్త ప్రాజెక్టుల్లో అయిదు మెగా ఫుడ్ పార్క్స్, నాలుగు ఫిషింగ్ క్లస్టర్స్ నిర్మిస్తామని మోడీ ప్రకటించారు.

మోడీ శ్రీకారం చుట్టిన అభివృద్ధి పనులు

కాచిగూడ – రాయ్ చూర్ మధ్య నూతన రైలును మోడీ ప్రారంభించారు. హసన్ – చర్లపల్లి హెచ్ పీ సీఎల్ ఎల్పీజీ పైపులైన్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. వరంగల్లు – ఖమ్మం – విజయవాడ హైవే పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణపట్నం – హైదరాబాద్ మల్టీ లెవల్ ప్రాజెక్టు పైపులైన్ ను ప్రారంభించారు. రూ.2,457 కోట్లతో నిర్మించనున్న సూర్యాపేట – ఖమ్మం హైవే కు శంకుస్థాపన చేశారు.


Share

Related posts

జివో 2430 రద్దుకై టిడిపి నిరసన

somaraju sharma

‘ఓం’ కనిపించింది – 2020 దరిద్రం వదిలిపోయింది.

Naina

అవును.. యాంకర్ ప్రదీప్ నా క్రష్.. అసలు నిజం బయటపెట్టేసిన ఢీ షో జడ్జి పూర్ణ

Varun G