Guppedantha Manasu:గుప్పెడంత మనసు సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సీరియల్ స్టార్ మా లోమొదలైనప్పటి నుంచి ఇప్పటివరకుమంచి టిఆర్పి రేటింగ్స్ దూసుకుపోతుంది.వంటలక్క సీరియల్ ని కూడా క్రాస్ చేసి మరీ టిఆర్పి రేటింగ్స్ లో దూసుకుపోయిన సీరియల్ గుప్పెడంత మనసు.ఈ సీరియల్ రిషి వసుధర క్యారెక్టర్స్ కి బయట మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ క్యారెక్టర్ లోరక్షా గౌడ మరియు ముఖేష్ గౌడ ఇద్దరూ వారి వారి క్యారెక్టర్స్ లో అద్భుతమైన నటనని ప్రదర్శిస్తూ ఉన్నారు ఇక ఇదే సీరియల్ లో హీరో తల్లి పాత్రలో నటిస్తున్న జగతి గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మనం తెలుసుకుందాం..

గుప్పెడంత మనసు జగతి అంటే ప్రతి ఒక్కరికి పరిచయమైన పేరే, ఆ క్యారెక్టర్ లో జ్యోతి రాయి అద్భుతమైన నటనని పండిస్తూనే చెప్పాలి. ఈ సీరియల్ లోజగతీక్యారెక్టర్ వల్లే మంచి హైప్ వచ్చింది అని కూడా చెప్పొచ్చు. జ్యోతి రాయి తెలివి ఇంటి ఆడపడుచు లాగా మంచి చీర కట్టుతో ఈ సీరియల్ లో జగదీపాత్రలో హీరో తల్లిగా, మెయిన్ క్యారెక్టర్ అనే చెప్పచ్చు. కొడుకు ప్రేమ కోసం తపించే తల్లి క్యారెక్టర్ లో, తను పడే బాధతో ఈ క్యారెక్టర్ లో జ్యోతి జీవించేసింది. తెలుగు ఆడియోస్ సినిమాలతో పాటు సీరియల్స్ ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తుంటారు ఇక ఈ సీరియల్ లో జ్యోతి రాయిని కూడా అట్నే ఆదరిస్తున్నారు. ఫ్యామిలీఎమోషన్స్ తో పాటు మంచి యూత్ లవ్ కూడా ఈ సీరియల్ లో నడిపిస్తున్నారు.

కన్నడ హీరోయిన్ అయినా జ్యోతి రాయి సీరియల్స్ లోను సినిమాలోని నటిస్తోంది. ఒక డైరెక్టర్ ని పెళ్లి చేసుకోబోతోంది. మాటరాని మౌనం ఇది శుక్ర సినిమాలతో తెలుగులో పరిచయమైన డైరెక్టర్ సురేష్ కుమార్. తాజాగా ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ దర్శకుని ఇప్పుడు మన జగతి పెళ్లి చేసుకోబోతోంది. ఈ డైరెక్టర్ తో జ్యోతి రాయి కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారన్న వార్త కూడా ఉంది ఇటీవల సుకు పూర్వాజ్, అలియాస్ సురేష్ కుమార్, జ్యోతిరాయ్ తో ఉన్న ఫోటోను షేర్ చేసి త్వరలో గుడ్ న్యూస్ చెబుతామని కూడా తెలియజేశారు. వీరికి నిశ్చితార్థం కూడా ఆల్రెడీ అయిపోయింది అన్నట్టు కూడా ఉంది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు కానీ పెళ్లెప్పుడు తెలియాల్సి ఉంది కాదా వీళ్ళిద్దరికీ ఇది రెండో పెళ్లి అని తెలుస్తోంది. వీరిద్దరి ఫొటోస్ జ్యోతి రాయి తన అఫీషియల్ ఇంస్టాగ్రామ్ పేజీలో కూడా షేర్ చేసింది మరియు డైరెక్టర్ కూడా తన ఇంస్టాగ్రామ్ లో వీరి ఫోటోని షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటో చూసిన వాళ్ళందరికీ వీలు పెళ్లి చేసుకోబోతున్నారని అర్థమవుతుంది.
