MAA: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు పూర్తి అయిపోయి ఫలితాలు వెల్లడి అయిన తరువాత కూడా వివాదాలకు తెరపడలేదు. విబేధాలు ఇంకా ముదురుతున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు అందుకు ఉదాహారణలుగా నిలుస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియలో దౌర్జన్యాలు, దాష్టీకాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలుపొందిన 11 మంది ఇటీవల రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వీరి రాజీనామాలపై మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణు నిర్ణయం తీసుకోలేదు. అంతకు ముందు మా సభ్యత్వానికి నాగబాబు, ప్రకాశ్ రాజ్ లు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలపై తొలి ఈసీ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చైర్మన్ మంచు విష్ణు తెలిపారు.
MAA: ఎన్నికల రోజు సీసీ పుటేజీ దృశ్యాలు ఇవ్వండి
ఈ తరుణంలో మా అధ్యక్షుడుగా పోటీ చేసి పరాజయం పాలైన ప్రకాశ్ రాజ్ నేడు ఎన్నికల అధికారికి లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకోంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు చేసిన ఆరోపణలకు సాక్షాలను సేకరించే పనిలో నిమగ్నమైయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా ఎన్నికల అధికారికి సీసీ టీవీ పుటేజీ దృశ్యాలు ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ లేఖ రాశారు. ఎన్నికల రోజు సీసీ టీవీ దృశ్యాలు ఇవ్వాలని మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాసినట్లు తెలిపారు. త్వరగా స్పందించకపోతే సీసీ టీవీ పుటేజీ ను తొలగించడం లేదా మార్చేస్తారనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు సంబంధించి ప్రతి సమాచారం పొందే హక్కు తమకు ఉందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. పోలింగ్ రోజు కొంత మంది వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని, మోహన్ బాబు, నరేష్ మా సభ్యులను బెదిరించారనీ, దాడులకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ఆరోపించారు. ఎన్నికల అధికారే వారిని, వారి అనుచరులను పోలింగ్ ప్రదేశంలోకి అనుమతించారని భావిస్తున్నామన్నారు.
‘మా’లో అలజడి
మా ఎన్నికలు జరిగిన తీరు జనంలో మనల్ని చులకన చేసిందనీ, అసలేం జరిగింది అనే విషయాలు మా సభ్యులు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. పోలింగ్ సమయంలో సీసీ కెమెరాలు వాడినట్లు మీరే (ఎన్నికల అధికారి) చెప్పారనీ, ఆ సీసీ టీవీ దృశ్యాలు తమకు ఇవ్వాలని ప్రకాశ్ రాజ్ కోరారు. సీసీ టీవీ దృశ్యాలు కోరే హక్కు తమకు అందని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల వరకూ దృశ్యాలు భద్రపర్చడం ఎన్నికల అధికారిగా మీ బాధ్యత అని కూడా ప్రకాశ్ రాజ్ లేఖలో పేర్కొన్నారు. ప్రకాశ్ రాజ్ ఈ విధంగా ఎన్నికల అధికారికి లేఖ రాయడం సినీ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. దీనిపై మా ఎన్నికల అధికారి, నూతనంగా ఎన్నికైన చైర్మన్ మంచు విష్ణు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!