NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Telangana Assembly Polls: బీజేపీ అధిష్టానానికి బిగ్ హెడేక్ గా మారిన ఆ నియోజకవర్గ అభ్యర్ధి ఎంపిక.. ఈటెల వర్సెస్ బండి ప్లస్ మాజీ గవర్నర్ సిఫార్సులు

Telangana Assembly Polls: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలైయ్యాయి. అభ్యర్ధుల ఎంపికలో అధికార బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంది. ఒకే సారి వందకు పైగా స్థానాలను అభ్యర్ధులను ప్రకటించడంతో వారు ప్రచార పర్వంలో దూసుకువెళుతున్నారు. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ 55 మందితో మొదటి జాబితా, నిన్న 45 మందితో రెండో జాబితా విడుదల చేసింది. బీజేపీ అభ్యర్ధుల ఎంపికలో వెనుకబడి ఉంది. ఈ నెల 22వ తేదీన 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ, రెండో జాబితా ఒకే ఒక్క పేరుతో విడుదల చేసింది. జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయింపు జరపాలి అనే దానిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. పొత్తులో భాగంగా 20కి పైగా అసెంబ్లీ స్థానాలను జనసేన అడుగుతోంది.

మరో పక్క పలు నియోజకవర్గాల్లో ఎక్కువ మంది టికెట్లు ఆశిస్తుండటం, వారికి మద్దతుగా వేరువేరుగా సిఫార్సులు చేస్తుండటంతో పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అన్న ప్రచారం జరుగుతుండటం, దానికి తగ్గట్లుగా కొన్ని ఘటనలు కనబడుతుండటంతో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ యే అని భావిస్తూ కొందరు బీజేపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. బీజేపీలో నాలుగు నెలల క్రితం ఉన్న ఇప్పుడు లేదని అంటున్నారు. మరో పక్క పలు నియోజకవర్గాల్లో ఇద్దరు నేతలు టికెట్లు ఆశిస్తుండటం, వారికి పలువురు నేతలు సిఫార్సులు చేస్తుండటంతో అభ్యర్ధుల ఎంపిక అధిష్టానానికి తలనొప్పిగా మారుతోంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెజార్టీ స్థానాలకు అభ్యర్దులను ఇప్పటికే ప్రకటించిన బీజేపీ .. వేములవాడ సిగ్మెంట్ ను మాత్రం పెండింగ్ లో పెట్టింది. ఈ నియోజకవర్గం నుండి మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ లు టికెట్ ఆశిస్తున్నారు. తనయుడికి టికెట్ ఇప్పించేందుకు ఏకంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రంగంలకి దిగారు. 2021 జూన్ లో అధికార బీఆర్ఎస్ రాజీనామా చేసి బీజేపీలో చేరిన తుల ఉమా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. ఇప్పటికే గడప గడపకు తుల ఉమా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పార్టీ టికెట్ వచ్చినా, రాకున్నా పోటీ చేయడానికి ఆమె సిద్దం అవుతున్నట్లు సమాచారం. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు గత ఏడాది కాలంగా వేములవాడలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బీజేపీలో చేరారు. విద్యాసాగర్ రావు తన తనయుడు కోసం బీజేపీ సీనియర్ నేతలు సునీల్ బన్సల్ తో పాటు ప్రకాశ్ జవదేకర్ లను కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్సి బండి సంజయ్ కూడా వికాస్ రావు కు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మరో పక్క తుల ఉమాకు టికెట్ ఇస్తే గెలుస్తుందని ఈటెల రాజేందర్ భరోసా ఇస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ హైకమాండ్ పెద్దలకు చెప్పారు. వికాస్ రావు కోసం బండి సంజయ్, తుల ఉమా కోసం ఈటల రాజేందర్ లు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండటం పార్టీ అధిష్టానంకు పెద్ద హెడేక్ గా మారిందట.

మరో పక్క ఇప్పటికే బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ అభ్యర్ధులను ప్రకటించడంతో ఆ ఇద్దరు అభ్యర్ధులు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. బీఆర్ ఎస్ నుండి చెల్మెడ లక్ష్మీనర్శింహరావు, కాంగ్రెస్ నుండి ఆది శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుండి చెన్నమనేని విద్యాసాగర్ రావు సోదరుడి కుమారుడు చెన్నమనేని రమేష్ వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 లో టీడీపీ నుండి ఎమ్మెల్యే గా గెలిచిన చెన్నమనేని రమేష్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) లో చేరారు.

2010 ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత 2014, 2018 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్ధిగా రమేష్ విజయం సాధించారు. ఈ సారి బీఆర్ఎస్ రమేష్ కు టికెట్ ఇవ్వకుండా కొత్త అభ్యర్ధిని రంగంలోకి దింపింది. ఓ పక్క బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు ప్రచార పర్వంలో దూసుకువెలుతుండగా, బీజేపీ అభ్యర్ధి ఎంపిక జరగకపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. చెన్నమనేని వికాస్ రావు, తుల ఉమా లలో ఎవరికి బీజేపీ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తుంది అనే ఉత్కంఠ కొనసాగుతోంది.

Telangana Assembly Polls: బీజేపీ రెండో జాబితా విడుదల .. ఆశావహుల్లో నిట్టూర్పు..ఎందుకంటే..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju