Mamagaru October 28 Episode 41: చంగయ్య కొడుకులు సుధాకర్, పాండురంగా, గంగాధర్,శ్రీకాంత్, నలుగురు కలిసి ఇంటి ఆరు బయట నిలబడి ఉంటారు…ఆడవాళ్లు జాబ్ కి వెళ్తే మన పిల్లలు ఫ్యూచర్ బాగుంటుంది అని సుధాకర్ అంటాడు. చాటుగా అది విన్న చంగయ్య ఒరేయ్ పుత్ర రత్నాల్లారా, ఆడవాళ్ళని వంటింటి కుందేలుగా చేసి మిమ్మల్ని సింహాలుగా తీర్చిదిద్దితే, మీరేంట్రా ఆడవాళ్ళలనీ సింహాలు చేద్దామనుకుంటున్నారూ, మీరు కుందేలు అవుదాం అనుకుంటున్నారు, మారుస్తారా మీ బుద్ధి లేకపోతే నేనే మారుస్తా అనుకుంటూ లోపలికి వెళతాడు.

చంగయ్య తన నలుగురి కొడుకుల ఆదాయం ఎంత ఉందా అని, లెక్కలు వేస్తే లక్ష రూపాయలు వస్తుంది అలాగే,తన కోడళ్ల ఆదాయం కూడా లెక్కలు వేశాడు, వారిది రెండు లక్షలు వస్తుంది. కొడుకుల ఆదాయం కంటే కోడళ్ల ఆదాయం రెండు రెట్లు ఎక్కువగా వచ్చింది,అంటే కొడుకులకి రెండు రెట్లు కష్టాలు వస్తాయన్నమాట,ఒకవేళ కోడళ్ళు జాబ్ చేస్తే ఎలా చేస్తారు అని ఒక్కసారి ఊహించుకున్నాడు. పెద్ద కోడలు వసంత పెద్ద కొడుకు సుధాకర్ ని టీ తీసుకు రమ్మని రెండవ కోడలు లక్ష్మి రెండవ కొడుకుని ఇల్లు ఊడ్చలేదా ఏంటి ఈ చెత్త అని, మూడవ కోడలు గంగ మూడవ కొడుకు గంగాధర్ గొడుగు పట్టమని తిప్పుకుంటూ నడుస్తూ ఉండడం కలగంటాడు, దెబ్బకు షాక్ తో వద్దు ఇలా అస్సలు జరగకూడదు నా కొడుకులకు బుద్ధి చెబుతాను, అనుకుంటూ మీటింగ్ ఏర్పాటు చేస్తాడు.

నలుగురి కొడుకులతో చెంగయ్య ఒరేయ్ పుత్ర రత్నాల్లారా భార్యలు డ్యూటీ చేస్తే ఎలా ఉంటుందో,ఒక్కసారి ఊహించుకోండి మీ భార్యలు మీతో పనులు చేయించుకుంటారు అని లేనిపోనివి చెబుతాడు, అందుకు వాళ్లు ఊహించుకుని అమ్మో ఇలా ఒద్దు అని అనుకుంటారు. అప్పుడు చెంగయ్య మగవాడు సంపాదించాలి ఆడది ఇల్లు చూసుకోవాలి అని చెబుతాడు,ఆదిపత్యం మనది రాజ్యం మనది, అని కొడుకులని రెచ్చగొడతాడు చెంగయ్య.

అర్థమైందా అని చెంగయ్య అంటే…అర్థమైంది నాన్నగారు అంటారు. చంగయ్య వాళ్లు టీవీలైతే మనం రిమోట్ వాళ్లని సోఫాలా లేదా కుర్చీల్లా ఇంట్లో వస్తువుల గా మాత్రమే చూడాలి, నెత్తిన పెట్టుకోకూడదు,ఇంట్లోనే ఒక పక్కన కూర్చొని ఉండాలి. లేదంటే మనమీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తారు.

తరువాత మనల్ని తకధిమితం తకధిమితం అని ఆడిస్తారు అని, ఆడవాళ్ళని తొక్కి పడేయాలి మై డియర్ సన్స్ అని చెబుతాడు చంగయ్య, నా భార్య నాకు ఇచ్చిన విలువ నీ భార్యలు మీకు ఇస్తున్నారా అంటే, సుధాకర్ పాండురంగలు లేదు నాన్నగారు అని అంటారు. అయితే తప్పు మీదే అని చెబుతాడు చంగయ్య.అయితే గుర్తుపెట్టుకోండి మగాడు మాత్రమే సంపాదించాలి ఆడది వంటింటి కుందేలు లాగానే ఉండాలి ఓకే,అలాగే నాన్నగారు అంటారు,చంగయ్య నలుగురు కొడుకులు.