29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

టీ కాంగ్రెస్ నేత మల్లు రవికి నోటీసులు జారీ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

Share

తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మల్లు రవికి సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేశారు. ఈ నెల 12వ తేదీన విచారణ కు హజరు కావాలంటూ సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్, ఎమ్మెల్సీ కవితలకు వ్యతిరేకంగా తెలంగాణ గళం పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేశారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గత నెలలో కాంగ్రెస్ వార్ రూమ్ (సునీల్ కనుగోలు కార్యాలయం)పై పోలీసులు తనిఖీలు నిర్వహించి కంప్యూటర్ హార్డ్ డిస్క్ లు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నునీల్ కనుగోలుకు సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన సందర్భంలో మల్లు రవి స్పందిస్తూ.. కాంగ్రెస్ వార్ రూమ్ కు తానే ఇన్ చార్జిననీ, ఇస్తే తనకు నోటీసులు ఇవ్వాలి కానీ సునీల్ కనుగోలుకు నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలో మల్లు రవికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తొంది.

Mallu Ravi

 

ఈ కేసులో ఇప్పటికే సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హజరైయ్యారు. అతని వ్యాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. పోలీసుల నోటీసులపై ముందుగా సునీల్ కనుగోలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణ ప్రక్రియపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు విచారణకు హజరుకావాలని ఆదేశించింది. అయితే సునీల్ కనుగోలను అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హజరైయ్యారు. దాదాపు ఆరు గంటల పాటు విచారించిన పోలీసులు మరో సారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పినట్లుగా తెలుస్తొంది.

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇవ్వడానికి సిద్దమైన మాజీ ఎంపీ పొంగులేటి.. సంక్రాంతి తర్వాత బీజేపీలో చేరికకు మూహూర్తం ఫిక్స్..?


Share

Related posts

Weight Loss: బరువు తగ్గాలనుకొనే వారు ఇది ఒక్కటి తింటే చాలు..!! 

bharani jella

ఫోన్ వచ్చింది.. బెదిరిపోయాడు.. గుండు కొట్టించుకున్నాడు.. అసలు ఏమైందంటే?

Teja

ఇది అలాంటిలాంటి హోటల్ కాదు.. అప్పటి మందం హోటల్!

Teja